2025 క్రిస్మస్ స్పెషల్..నోట్లో వెన్నలా కరిగిపోయే స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

క్రిస్మస్ పండుగ వచ్చింది. చలికాలపు చల్లని గాలుల మధ్య వేడుక, ఉత్సాహం మరియు తీపి వంటకాల సందడి మొదలైంది. క్రిస్మస్ అంటేనే మనకు ఠక్కున గుర్తొచ్చేది కేక్. బేకరీలో డజన్ల కొద్దీ కేకులు అందుబాటులో ఉన్నప్పటికీ, మన చేతులతో ప్రేమగా తయారు చేసి కుటుంబ సభ్యులకు వడ్డించడంలో ఉండే ఆనందమే వేరు. ఈ 2025 క్రిస్మస్ రోజున మీ ఇంటిని సువాసనలతో నింపేసే సాఫ్ట్ స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్ ను మీ కిచెన్ రూమ్ లోనే ట్రై చేయండి.

చూడగానే ఆకట్టుకునే గులాబీ రంగు, నోట్లో వేస్తే కరిగిపోయే పుల్లని-తీపి రుచితో ఈ స్ట్రాబెర్రీ కేక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఇది పూర్తిగా గుడ్డు లేని కేక్ కాబట్టి ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా ఆస్వాదించవచ్చు. బేకరీ స్టైల్ స్ట్రాబెర్రీ కేక్ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Perfect Christmas Dessert Eggless Strawberry Cake Recipe in Telugu

కావలసిన పదార్థాలు
-మైదా పిండి
-బేకింగ్ పౌడర్
-బేకింగ్ సోడా
-పొడి చక్కెర
-వెన్న
-కాచి చల్లార్చిన పాలు
-స్ట్రాబెర్రీ ప్యూరీ
-వెనిల్లా ఎసెన్స్
-చిటికెడు ఉప్పు
-విప్డ్ క్రీమ్
-స్ట్రాబెర్రీ ముక్కలు
-చెర్రీస్
-రంగురంగుల స్ప్రింక్ల్స్

తయారీ విధానం

-ముందుగా ఓవెన్‌ ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీ-హీట్ చేయండి. కేక్ టిన్‌కు వెన్న రాసి, కొద్దిగా మైదా చల్లి సిద్ధం చేసుకోండి.

-స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బితే ప్యూరీ సిద్ధమవుతుంది. దీనిని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లెడ పట్టండి.

-మరొక గిన్నెలో వెన్న, పొడి చక్కెర వేసి మిశ్రమం క్రీమ్‌ లా మెత్తగా అయ్యే వరకు బాగా బీట్ చేయాలి. ఇందులోనే స్ట్రాబెర్రీ ప్యూరీ,వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా జల్లెడ పట్టిన మైదా మిశ్రమాన్ని,పాలను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. మిశ్రమాన్ని మరీ ఎక్కువగా గిలక్కొట్టకూడదు.

-ఇప్పుడు గిలక్కొట్టుకున్న మిశ్రమాన్ని కేక్ టిన్‌ లో పోసి 180 డిగ్రీల వద్ద సుమారు 30-35 నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలో టూత్‌ పిక్ ‌తో గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్లే.

-కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత, దానిపై విప్డ్ క్రీమ్‌ ను సమానంగా రాయాలి. పైన తాజా స్ట్రాబెర్రీ ముక్కలు, చెర్రీలు లేదా క్రిస్మస్ స్ప్రింక్ల్స్‌ తో అందంగా అలంకరించండి.

-కేక్ మరింత రిచ్‌ గా, మృదువుగా రావాలంటే పాలకు బదులుగా కొద్దిగా 'ఫ్రెష్ క్రీమ్' వాడవచ్చు.

[ of 5 - Users]
Story first published: Tuesday, December 23, 2025, 21:00 [IST]
Desktop Bottom Promotion