Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిశ్చింత..వేడి నీళ్లు కలిపితే నిమిషాల్లో చట్నీ రెడీ!
వేడి వేడి అన్నంలోకైనా, టిఫిన్స్ లోకైనా కొబ్బరి, వేరుశెనగ పచ్చడి ఉంటే ఆ రుచే వేరు. సాధారణంగా మన ఇళ్లలో ఎప్పటికప్పుడు తాజా చట్నీని తయారు చేసుకుంటుంటాం. అయితే ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో మీకు సమయం ఆదా కావడంతో పాటు అద్భుతమైన రుచిని అందించే బెస్ట్ చిట్కా ఒకటి ఉంది. అదే ఇన్ స్టంట్ కొబ్బరి-వేరుశెనగ చట్నీ మిక్స్.
ఒక్కసారి ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు. చట్నీ కావాల్సినప్పుడు ఈ పొడిలో కాస్త గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటే చాలు.. నిమిషాల్లో తాజా చట్నీ రెడీ అయిపోతుంది. దూర ప్రయాణాలు చేసేవారికి, బ్యాచిలర్స్ కి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. కొబ్బరి-వేరుశెనగ చట్నీ మిక్స్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
వేరుశెనగ గుళ్లు - 1 కప్పు
ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురుము - 1 కప్పు
వేయించిన శనగ పప్పు (పుట్నాలు) - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 10
చింతపండు - చిన్న ముక్క
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - 2 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 4
కారం - అర టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని అందులో వేరుశెనగ గుళ్లను వేసి నూనె లేకుండా కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పును కూడా వేసి తేలికగా వేయించాలి. అవి వేగిన తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు, కొద్దిగా చింతపండు ముక్క, ఎండు కొబ్బరి వేసి సన్నని మంటపై రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన పదార్థాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక ఆవాలు, మినపప్పు, తాలింపు ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ కారం వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్ లో పెట్టి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి-వేరుశెనగ పొడిని ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా పొడికి పట్టేలా ఒక నిమిషం పాటు సన్నని మంటపై వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో గుమగుమలాడే ఇన్ స్టంట్ చట్నీ మిక్స్ రెడీ. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications