Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చపాతీ,పూరీ,పరోటాల్లోకి అదిరిపోయే కుర్మా..వాసనకే సగం కడుపు నిండిపోతుంది..ఎలా చేసుకోవాలంటే
డైలీ భోజనంలో చపాతీ లేదా దోస తినడం మనలో చాలా మందికి అలవాటు. అయితే దానికి జోడీగా ఎప్పుడూ ఒకే రకమైన పప్పు, బంగాళాదుంప కూర లేదా పన్నీర్ వంటివి వండుతూ ఉంటాం. అయితే ఇవి బోర్ కొట్టేసి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుందా?
అయితే నాన్ వెజ్ కూర్మాలను సైతం మరిపించేలా, నోరూరించే సువాసనలతో, అద్భుతమైన రుచితో మెరిసిపోయే క్యారెట్ కుర్మా ట్రై చేయండి. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం. క్యారెట్ కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
లేత క్యారెట్లు - అర కిలో
పండిన టమోటాలు - 2
తాజాగా తురిమిన పచ్చి కొబ్బరి - అర కప్పు
పచ్చి మిరపకాయలు - 6
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీస్పూన్లు
గసగసాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 3
సువాసన కోసం: ఏలకులు - 2, లవంగాలు - 2, దాల్చిన చెక్క - చిన్న
ముక్క
పసుపు - అర టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
వంట నూనె - తగినంత
తాజా కొత్తిమీర - ఒక గుప్పెడు
తయారీ విధానం
-ముందుగా తరిగిన క్యారెట్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకుని, అవి మునిగేంత నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. క్యారెట్ లోని సహజమైన తీపి పోకుండా, మరీ మెత్తగా కాకుండా చూసుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు వేసి, కొద్దిగా నీరు చేర్చి వీలైనంత మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక లోతైన పాన్ పెట్టి, నూనె వేడి చేయండి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి అవి చిటపటలాడుతూ సువాసన వెదజల్లే వరకు వేయించాలి.
-ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత గులాబీ రంగులోకి మారే వరకు మగ్గనివ్వాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన టమోటాలు వేసి అవి మెత్తగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఈ దశలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసి మసాలాలు వాటికి బాగా పట్టేలా రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న కొబ్బరి గసగసాల ముద్దను వేసి కలపాలి.
-ఇప్పుడు మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి నీళ్ళు పోసి, ఒకసారి బాగా కలపాలి. మూత పెట్టి, నూనె పైకి తేలేంత వరకు చిన్న మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి.
-గ్రేవీ చిక్కబడిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే, కమ్మనైన, ఆరోగ్యకరమైన క్యారెట్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications