Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నేపాల్ స్పెషల్ చికెన్ చోలియా..మందుబాబులకు పండగే!
చోలియా అనేది నేపాల్ లోని నెవారీ కమ్యూనిటీకి చెందిన అత్యంత ప్రసిద్ధ వంటకం. చికెన్ తో చేసే చోలియా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, నేపాల్ సంస్కృతిలో భాగం. చలికాలంలో వేడివేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్.
ఇది అన్నం కంటే అటుకులు లేదా మందులో నంజుకోవడానికి చాలా బాగుంటుంది. చికెన్ చోలియాను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బోన్లెస్ చికెన్- 500 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1 టీస్పూన్
అల్లం - 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి - 8 రెబ్బలు
పచ్చిమిర్చి - 4
టమోటాలు - 2 పెద్దవి
కారం పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర -కొంచెం
టిమూర్- అర స్పూన్ (నేపాల్ వంటకాల్లో వాడే ప్రత్యేక మసాలా)
ఆవ నూనె- 4 టేబుల్ స్పూన్లు
మెంతులు- 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసుకోవాలి. దానికి కొంచెం ఉప్పు,పసుపు పట్టించి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-చోలియా రుచి రావాలంటే చికెన్ ను ఉడికించడం కంటే కాల్చడం ముఖ్యం. మీ దగ్గర బార్బెక్యూ గ్రిల్ ఉంటే బొగ్గుల మీద చికెన్ ముక్కలను రెండు వైపులా బాగా కాలేలా, అక్కడక్కడ నల్లటి మచ్చలు వచ్చేలా కాల్చండి.
-గ్రిల్ లేకపోతే ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి చికెన్ ముక్కలను హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. ముక్కలు బాగా వేగి, స్మోకీగా మారాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి.
-టమోటాలను స్టవ్ మీద నేరుగా పెట్టి కాల్చండి. తొక్క నల్లగా అయ్యాక, దానిని తీసేసి టమోటాను మెత్తగా పేస్ట్ లేదా చిన్న ముక్కలుగా చేయండి. ఈ టమోటా గుజ్జును చికెన్ ముక్కల్లో కలపండి.
-ఇప్పుడు చికెన్ గిన్నెలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, టిమూర్ లేదా మిరియాల పొడి వేయండి. నిమ్మరసం కూడా పిండండి. అన్నింటినీ బాగా కలపండి.
-ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో ఆవ నూనెను పొగలు వచ్చేంత వరకు వేడి చేయాలి.
-నూనె వేడయ్యాక మంట తగ్గించి అందులో మెంతులు వేయండి. మెంతులు బాగా వేగి నల్లగా మారాలి. తర్వాత ఎండుమిర్చి,చిటికెడు పసుపు వేయండి. వెంటనే ఈ వేడి వేడి నూనెను మసాలాలు కలిపి ఉంచిన చికెన్ మిశ్రమంపై పోయండి.
-నూనె పోసిన వెంటనే గరిటెతో మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. చివరగా కొత్తిమీర చల్లి గార్నిష్ చేయండి. దీనిని వెంటనే తినవచ్చు లేదా ఒక గంట పాటు పక్కన పెడితే మసాలాలు ముక్కలకు బాగా పడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications