Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
చికెన్, మటన్ కీమా రుచిని మైమరిపించే ఎగ్ కీమా.. తక్కువ ఖర్చులో రాయల్ టేస్ట్
రాత్రి వేళల్లో చపాతీ లేదా దోస చేసుకున్నప్పుడు, వాటిలోకి ఏం కూర చేయాలో తెలియక తికమక పడుతుంటారా? సాధారణంగా మనం చేసుకునే బంగాళాదుంప కుర్మా లేదా రొటీన్ గుడ్డు పులుసు బోర్ కొట్టిందా? అయితే ఎగ్ కీమా ట్రై చేయాల్సిందే.
సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు చికెన్ లేదా మటన్ కీమాను ఇష్టంగా తింటారు. కానీ అంతే అద్భుతమైన రుచితో, తక్కువ బడ్జెట్ లో కేవలం కోడిగుడ్లతోనే ఆ రుచిని మనం ఇంట్లో తెచ్చుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఇది చేయడం చాలా సులభం, పైగా రుచి అమోఘం. నోరూరించే ఎగ్ కీమా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు - 4
తాజా పచ్చి బఠానీలు -అర కప్పు
ఉల్లిపాయ - 1
టమోటా - 1
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 చెంచా
ధనియాల పొడి - 2 చెంచాలు
పసుపు -అర చెంచా
గరం మసాలా - 1 చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 చెంచాలు
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - 1 అంగుళం
లవంగాలు - 3
అనాస పువ్వు - 1
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గుడ్లు, చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టండి. నీరు మరిగేటప్పుడు మంట తగ్గించి మూత పెట్టి 10-12 నిమిషాలు ఉడికించండి.
-గుడ్లు బాగా ఉడికాక, తొక్క తీసేయాలి. ఉడికించిన గుడ్లను క్యారెట్ తురిమినట్లుగా తురుముకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేసి వేయించండి. సువాసన రాగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక తాజా పచ్చి బఠానీలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. బఠానీలు ఉడికాక ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమోటా పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి.
-ఇప్పుడు మంటను చిన్నగా చేసి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించి గ్రేవీ కోసం ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి.
-నీళ్లు మరిగి నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని అందులో వేయాలి. గరిటెతో నెమ్మదిగా కలుపుతూ, గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన ఎగ్ కీమా రెడీ. వేడి వేడి చపాతీ, పూరీ, దోసె లేదా బగారా రైస్ లోకి ఇది అదిరిపోయే కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications