Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఉప్పు చేప ఎర్ర కారం..రసం, సాంబార్లలోకి పర్ఫెక్ట్ నంజుడు..ఆంధ్రా స్టైల్ లో ఎలా చేసుకోవాలంటే..
మనదేశంలో సముద్ర తీర ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల్లో ఎండు చేపలు (ఉప్పు చేపలు) ఆహారంలో ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వీటిని సూర్యరశ్మిలో ఎండబెట్టి, ఉప్పుతో నిల్వ చేస్తారు..దీంతో వాటి రుచి మరింత ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి. మాంసం అందుబాటులో లేని వర్షాకాలంలో లేదా తీరప్రాంతం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలలో నిల్వ ఆహారంగా కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఉప్పు చేప ఎర్ర కారం అనేది మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన, రుచికరమైన వంటకం. దీనిని సరైన పద్ధతిలో తయారుచేసుకొని, మితంగా తీసుకుంటే దాని రుచిని ఆస్వాదించవచ్చు.
ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుని తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఈ రెసిపీని తయారుచేయడానికి ఉపయోగించే ఎండు చేప రకాన్ని బట్టి లేదా ఎర్ర కారం కలిపే విధానాన్ని బట్టి రుచి కొద్దిగా మారుతూ ఉంటుంది. ఉప్పుచేప ఎర్ర కారం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉప్పు చేపలు
-వెల్లుల్లి
-ఎండుమిర్చి
-ఆయిల్
-ఉప్పు
తయారీ విధానం
-నాలుగు ఉప్పు చేపలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేప పక్కకు ఉండే పొలుసులను చేత్తో పీకేసుకోవాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో మీ కారంకి తగినంత ఎండుమిరపకాయలను వేసి,ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రౌండ్ చేసి ఆ కారం పొడిని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద గుంత బాండీ పెట్టి అందులో ఉప్పు చేప ముక్కలను వేసి దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఎంత వేగితే చేప అంత టేస్టీగా ఉంటుంది.
-చేప ముక్కలు వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి.
-తర్వాత చేప ముక్కల్లో నీళ్లు పోసి చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో శుభ్రంగా కడిగి ఉంచిన చేప ముక్కలను వేసి 4-5 నిమిషాలు వేయించాక స్టవ్ ఆపేసి ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కారం పొడిని చేప ముక్కల్లో వేసి కలపుకోవాలి. అంతే టేస్టీ ఉప్పుచేప ఎర్రకారం రెసిపి రెడీ.
-పప్పుచారు, సాంబార్ లేదా రసం చేసుకున్నప్పుడు ఈ ఉప్పుచేపను నంజుకొని తింటుంటే ఆ మజా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. చేప ముక్కలు తిన్నాక బాండీలోని కారం పొడిలో అన్నం కలుపుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది.
ఇది గుర్తుంచుకోండి
ఉప్పు చేప ఎర్ర కారం చాలా రుచికరంగా ఉన్నప్పటికీ, దీనిని అధిక ఉప్పు శాతం కారణంగా నిత్యం లేదా అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, దీన్ని అప్పుడప్పుడు, తక్కువ మోతాదులో రుచికోసం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











