Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అన్నం, పెరుగన్నం, పరాఠా.. దేనికైనా అదుర్స్ అనిపించే ఉల్లిపాయ ఊరగాయ
రోజూ తినే భోజనం బోర్ కొడుతోందా? పప్పు, చారు, కూర అన్నీ ఉన్నా ఏదో వెలితిగా, చప్పగా అనిపిస్తోందా? అయితే మీ భోజనానికి ఒక కారమైన, రుచికరమైన మలుపు ఇచ్చే సమయం వచ్చింది. ఆ మలుపే ఈ ప్రత్యేకమైన ఉల్లిపాయ ఊరగాయ. దీని రుచి చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.
ఊరగాయలంటే అదేదో పెద్ద ప్రయాసతో కూడిన పని అనుకుంటాం. కానీ ఉల్లిపాయ ఊరగాయను కేవలం నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఊరగాయ మీ భోజనానికి కొత్త ప్రాణం పోయడమే కాదు పరాఠా, పూరీ, వేడివేడి అన్నంలో పప్పుతో కలిపి తిన్నా లేదా చివరకు పెరుగన్నంలోకి నంచుకున్నా అమోఘంగా ఉంటుంది.

ఉల్లిపాయ ఊరగాయ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబారు ఉల్లిపాయలు- 500 గ్రాములు
ఆవాల నూనె - 1 కప్పు
ఆవాలు - 2 చెంచాలు
మెంతులు - 1 చెంచా
సోంపు గింజలు - 2 చెంచాలు
పసుపు పొడి - 1 చెంచా
ఎర్ర కారం - 2 చెంచాలు
ఉప్పు - రుచికి సరిపడా
వెనిగర్ - 2 చెంచాలు
నిమ్మరసం - 2 చెంచాలు
తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయలు మరీ చిన్నగా ఉంటే అలాగే ఉంచేయండి, కొంచెం పెద్దగా ఉంటే సగానికి కోయండి. ఇప్పుడు వాటిపై చుక్క నీరు కూడా లేకుండా శుభ్రమైన గుడ్డతో పూర్తిగా ఆరబెట్టాలి.
-ఇప్పుడు ఒక చిన్న బాండీలో ఆవాలు, మెంతులు, సోంపు వేసి చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని పూర్తిగా చల్లారనిచ్చి, మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు మరో బాండీలో ఆవాల నూనె పోసి పచ్చి వాసన పోయే దాకా వేడి చేశాక గ్యాస్ ఆపి, నూనెను గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి.
-ఇప్పుడు పొడిగా ఆరబెట్టుకున్న ఉల్లిపాయలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. వాటిపై మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడి, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు చల్లండి. వెనిగర్, నిమ్మరసం కూడా వేసి, ప్రతి ఉల్లిపాయ ముక్కకు మసాలా పట్టేలా బాగా కలపండి.
-చివరగా గోరువెచ్చగా ఉన్న ఆవాల నూనెను ఉల్లిపాయ మిశ్రమంలో పోసి మరోసారి బాగా కలపండి.
-ఇప్పుడు శుభ్రమైన, పొడి గాజు సీసాలో ఈ ఊరగాయను నింపండి. ఉల్లిపాయలు పూర్తిగా నూనెలో మునిగి ఉండేలా చూసుకోండి.
-ఈ సీసాను రెండు లేదా మూడు రోజుల పాటు మంచి ఎండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి, మసాలాల రుచులన్నీ చక్కగా పీల్చుకుని ఊరగాయ అద్భుతంగా తయారవుతుంది. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే ఉల్లిపాయ ఊరగాయ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications