Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
స్పైసీ బిర్యానీ లవర్స్ కోసం..అదిరిపోయే గ్రీన్ మసాలా చికెన్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే..
నాన్ వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకువచ్చేది చికెన్. వీకెండ్ వచ్చిందంటే చాలామంది ఇళ్లల్లో చికెన్ వంటకం ఉండాల్సిందే. చికెన్ ఫ్రై, కర్రీ, చికెన్ 65 ఇలా ఎన్ని రకాలున్నా బిర్యానీ అంటే ఉండే క్రేజ్ వేరు. అందులోనూ సౌత్ ఇండియన్ స్టైల్ స్పైసీ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు.
అయితే ఎప్పుడూ తినే రెగ్యులర్ దమ్ బిర్యానీ కాకుండా కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే గ్రీన్ మసాలా చికెన్ బిర్యానీ తప్పక ప్రయత్నించండి. రుచిలో అమోఘంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-చికెన్
-బాస్మతి బియ్యం
-పుదీనా ఆకులు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-అల్లం
-వెల్లుల్లి
-పెరుగు
-ఉల్లిపాయలు
-టమోటాలు
-మెంతి కూర
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకు
-మరాఠీ మొగ్గ
-స్టార్ పువ్వు
-షాజీరా
-పసుపు
-ఉప్పు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-చికెన్ మసాలా
-నూనె లేదా నెయ్యి
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో శుభ్రం చేసిన 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
-తర్వాత శుభ్రం చేసిన అర కేజీ చికెన్ ముక్కల్లో కొద్దిగా పసుపు, ఉప్పు, సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ లో సగభాగం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-1 గ్లాసు బాస్మతి బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నూనె లేదా నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, మిరియాలు వంటి మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
-తర్వాత అందులో 4 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత చిన్న కట్ట మెంతి కూర ఆకులు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మిగిలిన గ్రీన్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. తర్వాత 3 టమోటాల ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-టమోటాలు మగ్గిన తర్వాత కలిపి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇందులో కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పావు లీటరు పెరుగు వేసి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై ఉడికించాలి.
-చికెన్ సగం ఉడికిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి. బియ్యం విరగకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు బియ్యానికి తగిన మోతాదులో నీళ్లు (సాధారణంగా 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు) పోసి రుచికి సరిపడా ఉప్పు చూసుకోవాలి.
-నీళ్లు మరిగేటప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే వేడి వేడి గ్రీన్ మసాలా చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications