Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోరూరించే హైదరాబాద్ ఫేమస్ హరియాలీ చికెన్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
హైదరాబాద్ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ చికెన్ బిర్యానీ.కానీ హైదరాబాద్ వంటకాల్లో బిర్యానీతో పాటు అంతే ప్రజాదరణ పొందిన మరో అద్భుతమైన వంటకం హైదరాబాదీ హరియాలీ చికెన్ అని మీకు తెలుసా?
దీని క్రీమీ గ్రేవీ, మృదువైన చికెన్ ముక్కలు, సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలు ఆహార ప్రియులను కట్టిపడేస్తాయి. పేరుకు తగ్గట్టే, కొత్తిమీర, పుదీనా ఆకుల మిశ్రమం ఈ వంటకానికి ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగును ఇస్తుంది. స్వచ్ఛమైన నేతిలో వండే ఈ వంటకం హైదరాబాద్‌లోని పెళ్లిళ్లు, దావత్ ల వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా కనిపిస్తుంది. హైదరాబాదీ హరియాలీ చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్- 2 నుండి 2.25 కిలోలు
కొత్తిమీర- 50 గ్రాములు
పుదీనా- 100 గ్రాములు
అల్లం- 10 గ్రాములు
పచ్చిమిర్చి- 10 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు- 20 గ్రాములు
వేయించిన ఉల్లిపాయలు- 50 గ్రాములు
జీడిపప్పు- 50 గ్రాములు
బాదం- 50 గ్రాములు
పెరుగు- 100 గ్రాములు
ఒక నిమ్మకాయ రసం
ధనియాల పొడి- 4 టేబుల్ స్పూన్లు
కారం- 2 టీస్పూన్లు
పసుపు- 1 టీస్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
నెయ్యి- 150 గ్రాములు
పచ్చి ఏలకులు- 6
లవంగాలు- 8
నల్ల ఏలకులు- 5
దాల్చిన చెక్క- 2 ముక్కలు
గరం మసాలా- 1 టీస్పూన్
యాలకుల పొడి- 2 టీస్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో శుభ్రం చేసిన కొత్తిమీర, పుదీనా ఆకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం, పెరుగు వేసుకోవాలి. అవసరమైతే 2-3 స్పూన్ల నీరు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-చికెన్ ను శుభ్రంగా కడిగి నీరు వార్చాలి. ముక్కలకు నిమ్మరసం పట్టించి బాగా కలపాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఆకుపచ్చని పెరుగు పేస్ట్ ను చికెన్ లో వేసి, ప్రతి ముక్కకు మసాలా బాగా అంటుకునేలా చేత్తో కలపాలి.
-ఒక చిన్న బాండీలో నెయ్యి వేడి చేసి, అందులో లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల ఏలకులు, దంచిన పచ్చి ఏలకులు వేసి వేయించాలి.
-మసాలా దినుసుల సువాసన వచ్చే వరకు వేయించి, ఆ వేడి వేడి నెయ్యి మిశ్రమాన్ని మ్యారినేట్ చేసిన చికెన్ పై పోయాలి. ఇది చికెన్ కు అద్భుతమైన రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక పెద్ద పాన్ లేదా గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. మూత పెట్టి సన్నని మంటపై చికెన్ ముక్కలు మెత్తబడే వరకు నిదానంగా ఉడికించాలి.
-చికెన్ బాగా ఉడికి, నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా మరియు యాలకుల పొడి చల్లి ఒకసారి కలిపి దింపేయాలి.
-అంత నోరూరించే హైదరాబాదీ హరియాలీ చికెన్ రెడీ. దీనిని లచ్చా పరాఠా, రుమాలి రోటీ, బటర్ నాన్ లేదా వేడి వేడి అన్నంతో వడ్డిస్తే ఆ రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications