Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
నోట్లో వేస్తే కరిగిపోయే అద్భుతమైన సొరకాయ బర్ఫీ..చేసుకోవడం చాలా ఈజీ
భారతీయ వంటకాలలో స్వీట్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండుగలైనా, వేడుకలైనా లేదా చిన్నపాటి సంతోషాలైనా.. నోరు తీపి చేసుకోకుండా మనకు సంబరం పూర్తి కాదు. స్వీట్లలోనే ఒక అద్భుతమైన, నోరూరించే స్వీట్ సొరకాయ బర్ఫీ.
సొరకాయ బర్ఫీ చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మైదా, శనగపిండి వంటి వాటితో చేసే స్వీట్లతో పోలిస్తే ఇది చాలా తేలికైనది,ఆరోగ్యకరమైనది. కూరగాయలు తినని పిల్లలకు సొరకాయలోని పోషకాలను అందించడానికి ఇది ఒక తెలివైన మార్గం.

సొరకాయ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ - 1 (సుమారు అర కేజీ)
చక్కెర - 1 కప్పు
పాలు - 1 కప్పు
ఖోయా (స్వీట్ లెస్) లేదా పాల పొడి - అర కప్పు
నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల తరుము - పావు కప్పు
ఫుడ్ కలర్ (ఆకుపచ్చ) - చిటికెడు
తయారీ విధానం
ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, తొక్క చెక్కాలి. దానిని రెండుగా కోసి, లోపల ఉన్న గింజలు, మెత్తటి గుజ్జును ఒక స్పూన్ తో పూర్తిగా తీసివేయాలి.
ఇప్పుడు గట్టిగా ఉన్న భాగాన్ని మాత్రమే సన్నగా తురుముకోవాలి. తురిమిన సొరకాయలో నీటిని పూర్తిగా పిండివేయాలి.
ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా పాన్ ను స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక నీరు పిండిన సొరకాయ తురుమును వేసి పచ్చి వాసన పోయే వరకు 5-7 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించాలి.
సొరకాయ తురుము వేగాక అందులో పాలు పోసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. పాలు ఇంకిపోయి సొరకాయ మెత్తబడ్డాక, తురిమిన ఖోయా లేదా పాల పొడిని వేసి కలపాలి.
ఇప్పుడు పంచదార వేసి కలపాలి. మీడియం మంట మీద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఈ దశలో కావాలనుకుంటే చిటికెడు ఆకుపచ్చ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.
మిశ్రమం పాన్ అంచులను వదిలి, ముద్దలా తయారయ్యే వరకు ఉడికించాలి. ఈ దశకు రావడానికి సుమారు 10-15 నిమిషాలు పట్టవచ్చు. ఇప్పుడు మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, సగం డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి బాగా కలపాలి. మిశ్రమం సరైన దశకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి, కొద్దిగా చల్లార్చి చేతితో ఉండ చుడితే అది అంటుకోకుండా వస్తుంది.
ఒక ప్లేట్ లేదా ట్రేకు నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సిద్ధమైన బర్ఫీ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి మార్చి, ఒక స్పూన్ తో సమానంగా పరచాలి. పైన మిగిలిన డ్రై ఫ్రూట్స్ పలుకులతో అలంకరించాలి.
బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి. కనీసం 1-2 గంటలు పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సొరకాయ బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications