Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే!
పండుగైనా, ఇంట్లో బర్త్ డే పార్టీ అయినా, లేక వీకెండ్ స్పెషల్ విందు అయినా..చివర్లో వేడి వేడి గులాబ్ జామున్ నోట్లో పడకపోతే ఆ వేడుకకు అసలు పూర్తి సంతృప్తే రాదు. అయితే బయట కొనే గులాబ్ జామున్ల రుచి వేరు, ఇంట్లో చేసే వాటి రుచి వేరు. ఇంట్లో గులాబ్ జామున్ చేసిన ప్రతిసారీ.. లోపల పిండి ఉడకకుండా గట్టిగా ఉండిపోవడమో, లేదా పంచదార పాకంలో వేయగానే విరిగిపోయి ముద్దగా మారడమో జరుగుతూ ఉంటుంది.

పెళ్లిళ్లలో లేదా స్వీట్ షాపుల్లో చేసే గులాబ్ జామున్లు మాత్రం భలే మృదువుగా, రసభరితంగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి. మరి వారి సీక్రెట్ ఏమిటి? మన ఇంట్లో కూడా అచ్చం అలాంటి గులాబ్ జామున్లు తయారు చేయాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆ సీక్రెట్స్ ఏంటో ఇక్కడ చూడండి.
స్వీట్ షాపు స్టైల్ అసలు రహస్యం ఇదే
సాధారణంగా మనం ఇంట్లో గులాబ్ జామున్ చేసేటప్పుడు కేవలం కోవా (మావా) లేదా మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ మిక్స్ మాత్రమే ఉపయోగిస్తాం. కేవలం మావా వాడటం వల్ల జామున్లు చాలా బరువుగా, లోపల గట్టిగా మారతాయి. హల్వాయిలు చెప్పే మొదటి సీక్రెట్ ఏమిటంటే.. మావాకి సరైన నిష్పత్తిలో పనీర్ (లేదా చెనా) కలపడం. ఒక కిలో కోవా తీసుకుంటే, దానికి కచ్చితంగా అర కిలో పనీర్ కలపాలి. ఇలా పనీర్ జోడించడం వల్ల గులాబ్ జామున్లకు మనం ఆశించే ఆ స్పాంజి లాంటి మృదుత్వం వస్తుంది.
బొంబాయి రవ్వతో మ్యాజిక్
గులాబ్ జామున్లు నూనెలో లేదా పాకంలో వేసినప్పుడు విడిపోకుండా, వాటి ఆకారాన్ని నిలబెట్టుకోవడానికి బైండింగ్ చాలా ముఖ్యం. దీనికోసం పిండిలో కొద్దిగా మైదా, అలాగే సన్నటి బొంబాయి రవ్వ (సూజీ) కలపాలి. బొంబాయి రవ్వను కలపడం వల్ల అది పంచదార పాకాన్ని లోపలి దాకా పీల్చుకోవడమే కాకుండా, జామున్ల ఆకారం దెబ్బతినకుండా కాపాడుతుంది.
పిండి కలిపే విధానంలోనే ఉంది కిటుకు
పిండిముద్దను తయారుచేసేటప్పుడు అందులో రెండు టీస్పూన్ల బేకింగ్ పౌడర్,
మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత కొద్దిగా
నూనె లేదా నెయ్యి చేర్చి, పిండిని ఎక్కడా గడ్డలు లేకుండా వెన్నలా
సున్నితంగా కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టేటప్పుడు
అరచేతిలో నెయ్యి రాసుకుని, ఉండల పైన ఎలాంటి పగుళ్లు లేదా క్రాక్స్
లేకుండా నునుపుగా చూసుకోవాలి. పగుళ్లు ఉంటే నూనెలో వేయగానే అవి
విడిపోతాయి.

వేయించే కళ - పాకం పర్ఫెక్షన్
గులాబ్ జామున్లను వేయించేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. మంటను పెంచడం. ఎప్పుడూ కూడా గులాబ్ జామున్లను మధ్యస్థంగా వేడెక్కిన నూనె లేదా నెయ్యిలో వేసి వెంటనే మంటను సిమ్ లో పెట్టాలి. అవి వాటంతట అవే పైకి తేలే వరకు గరిటెతో అస్సలు కదపకూడదు. అప్పుడే అవి లోపలి దాకా సమంగా ఉడుకుతాయి.
డబుల్ సిరప్ టెక్నిక్
స్వీట్ షాపుల్లో గులాబ్ జామున్లు అంత జ్యూసీగా ఉండటానికి కారణం వాళ్లు
వాడే రెండు ప్యాన్ల పాకం పద్ధతి. పాకం కోసం రెండు వేర్వేరు పాత్రలను
వాడండి. ఒకదాంట్లో పల్చటి పాకం, మరొకదాంట్లో చిక్కటి పాకం పట్టుకోండి.
వేయించిన గులాబ్ జామున్లను ముందుగా పల్చటి పాకంలో వేసి 5 నిమిషాల పాటు
ఉంచాలి. పల్చగా ఉండటం వల్ల పాకం జామున్ల లోపలి పొరల దాకా సులభంగా
ఇంకుతుంది. ఆ తర్వాత వాటిని తీసి చిక్కటి పాకంలో వేసుకోవాలి. ఇంతే ఈ
చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ గులాబ్ జామున్లు చేస్తే, ఎవరైనా సరే
వావ్ అద్భుతం అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications