Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రోటీన్ చట్నీలకు బ్రేక్..కొత్తగా, కమ్మగా దొండకాయ పచ్చడి..అన్నంలోకి,టిఫిన్లలోకి కేక
ప్రతిరోజూ చేసుకునే కొబ్బరి చట్నీ, టమాటా పచ్చడి, పల్లీల చట్నీలతో బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, ఆరోగ్యకరంగా, నోరూరించేలా ఉండే దొండకాయ చట్నీని ప్రయత్నించండి. దొండకాయతో చేసే ఈ చట్నీ రుచి అమోఘం.
ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలనడం ఖాయం. ఇది కేవలం బ్రేక్ ఫాస్ట్ లోకే కాదు, వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. రుచికరమైన దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
లేత దొండకాయలు - పావు కిలో
పండిన టమాటాలు - 2
పచ్చి మిరపకాయలు - 8
చింతపండు -నిమ్మకాయంత
కొత్తిమీర - చిన్న కట్ట
పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె కాస్త వేడెక్కాక వేరుశనగ పప్పు(పల్లీలు), ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాక ఇందులో పచ్చి మిరపకాయలు వేసి రంగు మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నూనె వేసి తరిగిన దొండకాయ ముక్కలు వేయండి. అవి మెత్తబడి, పచ్చి వాసన పోయే వరకు 5-7 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించాలి. తర్వాత పసుపు, చింతపండు, టమాటా ముక్కలు వేసి ఇవి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి మగ్గించండి.
-దొండకాయ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, మగ్గించిన దొండకాయ-టమాటా మిశ్రమం, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-చివరిగా తాలింపు కోసం చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి అవి బంగారు రంగులోకి వచ్చాక, దంచిన వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి వెంటనే స్టవ్ ఆపేయండి.
-తాలింపును రుబ్బి పెట్టుకున్న చట్నీపై వేసి బాగా కలపండి. అంతే కమ్మనైన దొండకాయ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










