Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
పిల్లలు పాలకూర తినడం లేదా? ఇలా పూరీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు!
భారతీయ వంటకాల్లో పూరీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండుగలైనా లేదా సాధారణ రోజుల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా వేడివేడిగా, పొంగుతూ ఉండే పూరీలు నోరూరిస్తాయి. అయితే ఆ సాధారణ పూరీకి ఒక ఆరోగ్యకరమైన, రంగులమయమైన, రుచికరమైన రూపాన్ని ఇస్తే..అదే పాలక్ పూరీ.
ఈ పూరీలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలక్ పూరీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తాజా పాలకూర: 1 కట్ట (250 గ్రాములు)
గోధుమ పిండి: 2 కప్పులు
శెనగపిండి : 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
పచ్చి మిరపకాయలు: 2
వాము: అర టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పిండిలో కలపడానికి 2 టీస్పూన్లు
నూనె: పూరీలు వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, అందులో శుభ్రం చేసిన పాలకూర ఆకులను వేసి కేవలం 2-3 నిమిషాల పాటు ఉడికించాలి . ఇలా చేయడం వల్ల ఆకుల పచ్చి వాసన పోతుంది. వెంటనే ఆకులను తీసి చల్లటి నీటిలో వేయాలి. దీనివల్ల పాలకూర తన సహజమైన పచ్చని రంగును కోల్పోకుండా ఉంటుంది.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లారిన పాలకూర, పచ్చి మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపవచ్చు, కానీ వీలైనంత వరకు నీళ్లు లేకుండా రుబ్బితే పిండి కలపడానికి సులభంగా ఉంటుంది.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, శెనగపిండి , వాము, జీలకర్ర పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపాక 2 టీస్పూన్ల నూనె వేసి పిండికి బాగా పట్టించండి.
-ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూర ప్యూరీని కొద్దికొద్దిగా పిండిలో వేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండి ఎప్పుడూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడే పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా బాగా పొంగుతాయి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చేర్చండి.
-కలిపిన పిండిపై కొద్దిగా నూనె రాసి ఒక తడి గుడ్డ కప్పి 20-30 నిమిషాల పాటు నాననివ్వాలి.
-నానిన పిండిని మరోసారి బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని, కొద్దిగా నూనె రాసుకుని చిన్న పూరీలుగా వత్తుకోవాలి. మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా సమానంగా వత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి బాగా వేడి చేయాలి.
-ఇప్పుడు వత్తుకున్న పూరీని నెమ్మదిగా నూనెలో వేయాలి. గరిటతో నెమ్మదిగా నొక్కితే పూరీ బాగా పొంగుతుంది. ఒకవైపు బంగారు రంగులోకి రాగానే, రెండో వైపుకు తిప్పి కాల్చుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే పాలక్ పూరీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications