Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
నోరూరించే దహీ పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపించడం సహజం. అందులోనూ చాట్ అంటే లొట్టలేయని వారు ఎవరుంటారు? పానీ పూరి, సేవ్ పూరి పేర్లు వినగానే మనకు తెలియకుండానే నోట్లో నీళ్లు ఊరుతాయి. అయితే ఎప్పుడూ తినే పానీ పూరీకి కాస్త భిన్నంగా, కమ్మని రుచిని ఇచ్చే దహీ పూరీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ప్రయత్నించారా?
బయట బండ్ల మీద దొరికే వాటి కంటే ఇంట్లో తాజా పెరుగుతో చేసుకుంటే ఆ రుచే వేరు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడుపులో మంటగా ఉన్నప్పుడు పెరుగుతో చేసే ఈ చాట్ ఎంతో హాయినిస్తుంది. తీపి, పులుపు, కారం కలగలిసిన ఈ అద్భుతమైన దహీ పూరీని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గొల్గప్ప పూరీలు-15
గట్టి పెరుగు- కప్పు
బంగాళాదుంపలు-2
సన్నగా తరిగిన ఉల్లిపాయ-1
జీలకర్ర పొడి
చాట్ మసాలా
కారం
ఉప్పు
స్వీట్ చింతపండు చట్నీ
గ్రీన్ చట్నీ
సన్న కారప్పూస
కొత్తిమీర తురుము
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెరుగును గడ్డలు లేకుండా బాగా గిలక్కొట్టాలి.
-తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఉప్పు, నిమ్మరసం కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు వేడి నీటిలో నానబెట్టిన చింతపండు గుజ్జులో బెల్లం, కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి చిక్కబడే వరకు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత తేనెలా చిక్కబడుతుంది.
-ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని గొల్గప్ప పూరీలను అందంగా అమర్చండి. ప్రతి పూరీ మధ్యలో బొటనవేలితో చిన్న రంధ్రం చేయండి.
-రంధ్రం చేసిన ప్రతి పూరీలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూరండి. దీనిపై చిటికెడు ఉప్పు చల్లండి.
-ఇప్పుడు ప్రతి పూరీలో కొద్దిగా గ్రీన్ చట్నీ, మరికొద్దిగా తీపి చింతపండు చట్నీ వేయండి. ఆ వెంటనే గిలక్కొట్టిన కమ్మని పెరుగును పూరీల నిండా ఉప్పొంగేలా వేయండి. పెరుగు ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచి.
-పెరుగు పైన వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా కారం చల్లండి. చివరగా సన్న కారప్పూస, కొత్తిమీరతో అలంకరించండి. అంతే చూడగానే తినాలనిపించే దహీ పూరీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications