Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
లంచ్ బాక్స్ లో రంగుల విందు.. పిల్లలు ఇష్టంగా తినే బీట్ రూట్ సోయా రైస్
మన దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలలో బీట్రూట్ సోయా రైస్ ఒకటి.లంచ్ బాక్స్ ల కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్. బీట్ రూట్ సోయా రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
బీట్ రూట్ - 1 పెద్దది
మీల్ మేకర్- అర కప్పు
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టమాటో - 1
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసి స్టవ్
ఆపేయండి.
వేడి చేసిన నీళ్లలో మీల్ మేకర్(సోయా చంక్స్) వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి మెత్తబడిన తర్వాత వాటిని చేతితో గట్టిగా పిండి అదనపు నీటిని తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
తర్వాత ఒక గిన్నెలో నానబెట్టిన బియ్యం, 2 కప్పుల నీళ్లు, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి అన్నాన్ని పొడిపొడిగా వండుకోవాలి. అన్నం వండిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి.
ఒక పాన్ లేదా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు మీడియం మంటపై వేయించాలి.

తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాక ఇప్పుడు తురిమిన బీట్ రూట్ వేసి 5-7 నిమిషాల పాటు బాగా వేయించాలి.
బీట్ రూట్ లోని పచ్చిదనం పోయి, కొద్దిగా మెత్తబడే వరకు వేయించడం ముఖ్యం. టమాటో ముక్కలు (వాడుతున్నట్లయితే) వేసి, అవి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు పాన్ లో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఉండటానికి మంటను తగ్గించుకోవాలి.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న సోయా చంక్స్ వేసి, మసాలాలు వాటికి బాగా పట్టేలా 2-3 నిమిషాల పాటు కలపాలి.
చివరగా అందులో చల్లార్చిన అన్నాన్ని కొద్దికొద్దిగా వేస్తూ కలిపాక మూత పెట్టి 2-3 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ అవ్వనివ్వాలి.
స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన రైస్ లో నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications