Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బిర్యానీ, చపాతీ, పరోటాలోకి అదిరిపోయే కాంబినేషన్..కేరళ స్టైల్ చికెన్ రోస్ట్..ఎలా చేసుకోవాలంటే..
చికెన్ వంటకాల గురించి మాట్లాడుకుంటే కేరళ రాష్ట్రం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అక్కడి సుగంధ ద్రవ్యాలు, వంటల రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. కేరళ వంటకాల్లో వాడే మసాలాలు, కొబ్బరి నూనె, కరివేపాకు సాధారణ చికెన్ కూరను కూడా అద్భుతమైన రుచిగా మారుస్తాయి.
కేరళలోని హోటళ్లకు వెళ్తే అక్కడ దొరికే చికెన్ రోస్ట్ రుచిని అస్సలు మర్చిపోలేరు. వేడి వేడి బిర్యానీ, చపాతీ లేదా పరోటాతో ఈ రోస్ట్ ని నంజుకు తింటే ఆ మజానే వేరు. కేరళ స్టైల్ చికెన్ రోస్ట్ ని మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్: అర కిలో
పెరుగు: 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 4
టమోటా: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 2 టీస్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
చికెన్ మసాలా: 1 టీస్పూన్
లవంగాలు: 1 టీస్పూన్
దాల్చిన చెక్క: 1 టీస్పూన్
ఏలకులు పొడి: 1 టీస్పూన్
సోంపు: పావు టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకోండి. అందులో పెరుగు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఫ్రిజ్లో పెడితే ముక్కలు ఇంకా మెత్తగా ఉడుకుతాయి.
-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి బాండీలో నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత సోంపు వేసి వేయించండి. ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మంటను మీడియంలో ఉంచండి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు ఓపికగా వేయించాలి. ఆ తర్వాత తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న గరం మసాలా పొడి (లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క పొడి) వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. మసాలాలు మాడిపోకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు అందులో తరిగిన టమోటాలు, కరివేపాకు, చిటికెడు కుంకుమపువ్వు వేసి బాగా కలపండి.
-టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాక అందులో పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపండి. ఇందులో ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-సుమారు 20-25 నిమిషాల్లో చికెన్ మెత్తగా ఉడికి, నీరంతా ఆవిరైపోయి నూనె పైకి తేలుతుంది. ఈ దశలో చికెన్ మసాలా పౌడర్ చల్లి, మరో నిమిషం పాటు వేయించి, చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, స్పైసీ కేరళ చికెన్ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications