Latest Updates
-
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మాలు చూసి పిల్లలు పెదవి విరుస్తున్నారా? వాటిని సరిగ్గా తినకుండా మారాం చేస్తున్నారా? అయితే వారికి రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయండి. మీ వంటగదిలో సేమియా ప్యాకెట్, కొన్ని గుడ్లు ఉంటే చాలు.. నిమిషాల్లో కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా రెడీ చేయవచ్చు. పోషకాలు నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ ని ఒక్కసారి మీ పిల్లలకు రుచి చూపించారంటే.. వారానికోసారి తప్పకుండా దీన్నే చేయమని అడుగుతారు.

వెజిటబుల్ ఎగ్ సేమియా తయారీకి కావలసిన పదార్థాలు
సేమియా - 2 కప్పులు (సుమారు 200 గ్రాములు)
నీరు - 1 లీటరు
నూనె - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 1
ఉప్పు - రుచికి తగినంత
గుడ్లు - 3
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
తాలింపుకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 2 టీస్పూన్లు
మినపపప్పు - 1 టీస్పూన్
సన్నగా తరిగిన అల్లం - 1 అంగుళం ముక్క
కరివేపాకు - 1 రెమ్మ
క్యారెట్ - 1
బీన్స్ - 4
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
టమాటో - 1
కశ్మీరీ కారం పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ సేమియా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, సేమియా వేసి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఇప్పుడు అందులో 1 లీటరు నీళ్లు పోసి, ఒక పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. సుమారు 3 నిమిషాల పాటు ఉడికించండి. సేమియా మెత్తబడగానే, జల్లెడ సహాయంతో నీటిని వడకట్టండి. సేమియా అంటుకోకుండా పొడిపొడిగా ఉండటానికి వెంటనే కొద్దిగా చల్లటి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి.
-పక్కన మరో స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక 3 గుడ్లను పగలగొట్టి వేయండి. అందులో కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా కలుపుతూ పొరుటులా (భుర్జీ) వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, శనగపప్పు, మినపపప్పు వేసి ఎర్రగా వేయించండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. ఈ తాలింపులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పొడవాటి చీలికలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలపాలి. కూరగాయలు కాస్త మెత్తబడేలా మూతపెట్టి 2-3 నిమిషాలు మీడియం మంట మీద మగ్గనివ్వండి.
-కూరగాయలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరో నిమిషం పాటు మూతపెట్టి ఉడికించండి. టమాటా గుజ్జులా అయ్యాక, కశ్మీరీ కారం వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ భుర్జీని ఈ మిశ్రమంలో వేసి కలపండి. చివరగా ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి, మసాలా అంతా సేమియాకు పట్టేలా 2-3 నిమిషాల పాటు సున్నితంగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి వెజిటబుల్ ఎగ్ సేమియా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications