Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ఇడ్లీ,దోసె పిండి అక్కర్లేదు..రవ్వ,పెరుగుతో 15 నిమిషాల్లోనే ఊతప్పం..వంట రాని వాళ్లకు కూడా ఈజీ
ప్రతిరోజూ పొద్దున్నే టిఫిన్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఇడ్లీ, దోస పిండి లేనప్పుడు మనసు చివుక్కుమంటుందా? మీ వంటగదిలో కేవలం ఒక కప్పు రవ్వ, కొద్దిగా పెరుగు, కొన్ని కూరగాయలు ఉంటే చాలు కేవలం 15 నిమిషాల్లో అద్భుతమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయవచ్చు. అదే వేడివేడి రవ్వ ఉత్తప్పం. ఈ రవ్వ ఉత్తప్పం చేయడం ఎంత సులువో తినడానికి అంత కంటే రుచిగా ఉంటుంది. పైన రంగురంగుల కూరగాయలతో మెత్తగా, కరకరలాడుతూ ఉండే ఈ ఉత్తప్పం రుచి చూస్తే ఎవరైనా ఇట్టే ఇష్టపడతారు. దీనికి జతగా కొబ్బరి చట్నీ లేదా కారంగా ఉండే టమాటా చట్నీ కలుపుకుని తింటుంటే ఆ అనుభూతే వేరు. నోరూరించే రవ్వ ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ- 1 కప్పు
కొద్దిగా పులిసిన పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
క్యారెట్ - 2
క్యాప్సికమ్- 1
పచ్చిమిర్చి - 1
ఉప్పు - సరిపడా
నూనె - కాల్చడానికి అవసరమైనంత
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పులిసిన పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిగా అనిపిస్తే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి కలపండి. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి సుమారు 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ సమయంలో రవ్వ చక్కగా నాని, మెత్తగా అవుతుంది.
-15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పిండి నాని మరింత చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోస పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండేలా జారుడుగా కలుపుకోవాలి. మరీ పల్చగా చేయవద్దు.
-ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టి వేడి చేయండి. పెనం బాగా వేడెక్కాక కొద్దిగా నూనె వేసి పెనం అంతా పరచండి.
-ఇప్పుడు ఒక గరిటె నిండా పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా చిన్న ఉత్తప్పంలా వేయండి. దాని చుట్టూ ఒక చెంచా నూనె వేయండి.
-వెంటనే దానిపై మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ తురుము, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీరను రంగుల హరివిల్లులా చల్లండి. ఒక గరిటెతో వాటిని నెమ్మదిగా నొక్కడం వల్ల కూరగాయలు ఉత్తప్పంలో చక్కగా అతుక్కుంటాయి.
-ఒకవైపు బంగారు రంగులోకి వచ్చి చక్కగా కాలిన తర్వాత దానిని జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పండి. ఆ వైపు కూడా మరో నిమిషం పాటు కాల్చండి. కూరగాయలు చక్కగా మగ్గి, మంచి సువాసన వస్తుంది.
-రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వేడివేడి ఉత్తప్పాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని, మీకు ఇష్టమైన చట్నీతో కలిపి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
