Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
వర్షాకాలం రాగానే వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా మారుతుంది. వేడి వేడి పకోడీలు, అల్లం టీ తాగుతూ వర్షాన్ని ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. కానీ గృహిణులకు మాత్రం వంటగదిలో ఒక పెద్ద టెన్షన్ మొదలవుతుంది. అదే పప్పు దినుసులకు పురుగులు పట్టడం. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పు అయినా సరే.. వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా త్వరగా పాడైపోతాయి. వాటిలో సన్నని బూజు, తెల్లని పురుగులు చేరిపోతాయి.

ఎంతో ఖర్చుపెట్టి తెచ్చిన పప్పులు అలా కళ్లెదుటే పాడవుతుంటే పారేయలేక, వాడుకోలేక ఇబ్బంది పడటం ప్రతి ఇంట్లో జరిగేదే. అయితే ఇకపై మీరు ఆ చింత వదిలేయండి. ప్రముఖ చెఫ్ పంకజ్ భదౌరియా పప్పులు పాడవకుండా ఉండేందుకు ఒక అద్భుతమైన, అతి సులువైన కిచెన్ హ్యాక్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. అదేంటో ఇక్కడ చూడండి.
ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే..
మీ వంటగదిలో రోజూ కూరల్లో రుచి కోసం వాడే ఉప్పు..పప్పులను పురుగుల బారి నుండి కాపాడే అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా, ఎంతో సహజంగా పప్పులను సురక్షితంగా నిల్వ చేయడానికి ఇది బెస్ట్ ట్రిక్ అని పంకజ్ భదౌరియా తెలిపారు.
ఈ హ్యాక్ ఎలా ఉపయోగించాలి?
-ముందుగా మీరు పప్పులు నిల్వ చేయాలనుకుంటున్న డబ్బాను శుభ్రంగా కడిగి, లోపల ఎలాంటి తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకోవాలి.
-ఇప్పుడు ఆ డబ్బాలో పప్పులు పోసేటప్పుడు, వాటితో పాటు కొద్దిగా ఉప్పును కలపాలి. సాధారణ మెత్తటి ఉప్పు కంటే, రాళ్ల ఉప్పు లేదా కల్లుప్పు వాడటం మరింత ఉత్తమం).
-డబ్బా అడుగు భాగంలో కొద్దిగా ఉప్పు వేసి, ఆ తర్వాత సగం వరకు పప్పులు పోసి, మళ్ళీ కొద్దిగా ఉప్పు చల్లాలి. చివరగా డబ్బా నిండా పప్పు పోశాక పైన మరోసారి కొద్దిగా ఉప్పు వేసి గాలి చొరబడకుండా మూత గట్టిగా పెట్టాలి.
ఇది ఎలా పనిచేస్తుంది?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఆ తేమ డబ్బాల్లోకి చేరినప్పుడే పప్పులకు పురుగులు పడతాయి. ఉప్పుకు సహజంగానే తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. మీరు పప్పుల్లో ఉప్పు వేసినప్పుడు, అది డబ్బాలో ఉన్న తేమను లాగేసుకుని పప్పులను ఎల్లప్పుడూ పొడిగా ఉంచుతుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కీటకాలు, పురుగులు దరిచేరలేవు. పైగా ఉప్పు ఘాటుకు పురుగులు ఆమడ దూరం పారిపోతాయి.

గుర్తుంచుకోవాల్సిన మరో రెండు చిన్న చిట్కాలు
-పప్పులను ఎప్పుడూ గాలి చొరబడని ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లోనే నిల్వ చేయాలి.
-ఉప్పుతో పాటు డబ్బాలో రెండు మూడు ఎండుమిర్చి లేదా నాలుగైదు లవంగాలు వేసినా కూడా పురుగులు రాకుండా ఉంటాయి.
ఇకపై మార్కెట్ నుండి పప్పులు తీసుకురాగానే, డబ్బాలో పోసే ముందు ఈ ఉప్పు చిట్కాను పాటించండి. ఈ సింపుల్ టిప్ తో మీ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు.. వర్షాకాలంలో కూడా మీ వంటగదిని, సరుకులను సురక్షితంగా, పురుగుల్లేకుండా ఉంచుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications