Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
చపాతీ, దోశల్లోకి అమృతం లాంటి ఉల్లి కారం..ఎలా చేసుకోవాలంటే..
వేడి వేడి చపాతీలు లేదా కరకరలాడే దోశలలోకి నంజుకోవడానికి ఏ కూర చేయాలో తెలియక సతమతమవుతున్నారా? ఫ్రిజ్ తీసి చూస్తే కూరగాయలేవీ లేవా? కేవలం ఉల్లిపాయలు మాత్రమే కనిపిస్తున్నాయా? మీ దగ్గర ఉన్న ఆ ఉల్లిపాయలతోనే ఒక అద్భుతమైన సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు.
ముఖ్యంగా మీ వంటింట్లో చిన్న ఉల్లిపాయలు(సాంబార్ ఉల్లిపాయలు) ఉంటే, వాటి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలు పెద్ద ఉల్లిపాయల కంటే.. చిన్న ఉల్లిపాయలతో చేసే చట్నీ లేదా ఉల్లి కారం చాలా రుచిగా ఉంటుంది.

ఇది కేవలం చపాతీకే కాదు, ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి టిఫిన్లలోకి అమృతంలా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చినప్పుడు లేదా హడావిడి సమయాల్లో కేవలం 10-15 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. నోరూరించే చిన్న ఉల్లిపాయల కారం ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
చిన్న ఉల్లిపాయలు: 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు: 20
చింతపండు: అర టీస్పూన్
ఎండు మిరపకాయలు: 6
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 టీస్పూన్
ఆవాలు: పావు టీస్పూన్
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: చిటికెడు
పసుపు: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో పొట్టు తీసి శుభ్రం చేసుకున్న చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు,చింతపండు, ఎండు మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళు లేకుండానే దీనిని మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని (పేస్ట్) వేసి తక్కువ మంట మీద కనీసం 10 నిమిషాల పాటు వేయించాలి.
-ఉల్లిపాయల్లోని పచ్చి వాసన పూర్తిగా పోయి, గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. పాన్ కు అంటుకోకుండా మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు చిన్న పాన్ లో ఒక స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించండి. ఈ వేడి వేడి తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ చట్నీలో వేసి బాగా కలపండి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన చిన్న ఉల్లిపాయల కారం రెడీ.
-ఈ చట్నీలో నీళ్ళు వాడలేదు కాబట్టి,నూనెలో బాగా వేయించాం కాబట్టి ఇది త్వరగా పాడవదు. బయట ఉంచితే 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచితే దాదాపు 10 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
