Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉల్లి, టమాటా లేకుండా..కేవలం 10 నిమిషాల్లో బాంబే పూరీ మసాలా!
వీక్ డేస్ లో అయినా లేదా వీకెండ్స్ లో అయినా పండుగలు వచ్చినా మన తెలుగు ఇళ్లలో టిఫిన్ ప్లేట్లలో వేడివేడి పూరీలు లేదా చపాతీలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిని తయారు చేయడం ఎంత ఇష్టమో, వాటిలోకి సరైన సైడ్ డిష్ చేయడం కొన్నిసార్లు అంత తలనొప్పిగా అనిపిస్తుంది.
ఎప్పుడూ చేసే బంగాళాదుంప కుర్మా లేదా శనగపిండితో చేసే బొంబాయి చట్నీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొంచెం వెరైటీగా బాంబే పూరీ మసాలా ట్రై చేయండి. ఉల్లిపాయలు, టమాటాలు లేకుండా కేవలం బంగాళాదుంపలతో 10 నిమిషాల్లో హోటల్ స్టైల్ రుచితో బాంబే పూరీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు: 4
నూనె: 2 టీస్పూన్లు
కసూరి మేతి: అర టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
ఇంగువ: పావు టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, రెండు ముక్కలుగా కోసి కుక్కర్ లో వేయాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ముక్కలు మునిగేంత నీరు పోసి మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
-బంగాళాదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి చేత్తో మెత్తగా (మరీ పేస్ట్ లా కాకుండా అక్కడక్కడా చిన్న ముక్కలు తగిలేలా) స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను పూర్తిగా తగ్గించి కసూరి మేతిని అరచేతిలో వేసుకుని నలిపి నూనెలో వేయాలి. ఇలా నలపడం వల్ల మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు అదే నూనెలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంగువ వేసి దోరగా వేయించాలి. మసాలాల పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం వేయిస్తే చాలు.
-ఇప్పుడు ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పాన్‌లో వేసి మసాలాలతో బాగా కలపాలి. కూర మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని, రుచికి సరిపడా ఉప్పు, ఇంకొంచెం పసుపు వేసి బాగా కలపాలి.
-పాన్ మీద మూత పెట్టి, సుమారు 5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. దీనివల్ల బంగాళాదుంపలకు మసాలా రుచి బాగా పడుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బాంబే పూరీ మసాలా రెడీ. వేడివేడి పూరీల్లోకి లేదా చపాతీల్లోకి ఈ కూర ఉంటే లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications