Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చపాతీ, రోటీలోకి అదిరిపోయే కాంబినేషన్..చికెన్ క్యాప్సికమ్ ఫ్రై
చికెన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. అటువంటి చికెన్ కు, క్యాప్సికమ్ జోడిస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది. చికెన్, క్యాప్సికమ్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చికెన్ మెత్తగా ఉడికి, క్యాప్సికమ్ కాస్త కరకరలాడుతూ తగులుతుంటే తినడానికి చాలా బాగుంటుంది.
ఈ చికెన్ క్యాప్సికమ్ ఫ్రై చపాతీ, రోటీలకే కాకుండా వేడి వేడి అన్నం, బగారా రైస్ లో కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.

కావాల్సిన పదార్థాలు
చికెన్: 500 గ్రాములు
క్యాప్సికమ్: 2
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి:4-5
అల్లం:కొంచెం
లవంగాలు:4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకులు: 2
సోంపు: అర స్పూన్
చిన్న అల్లం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 6-8
కొత్తిమీర
పుదీనా
పసుపు
కారం
ధనియాల పొడి
జీలకర్ర పొడి
గరం మసాలా
నల్ల మిరియాల పొడి
నూనె
రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను ఉప్పు, నీళ్లతో శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక గిన్నెలో చికెన్ తీసుకుని, అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా పుదీనా,కొత్తిమీర వేసి, అవసరమైతే కొంచెం నీరు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా కడాయి పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు వేసి వేయించాలి. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగువచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను పాన్ లో వేసి మసాలాతో బాగా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. చికెన్ నుండి నీరు బయటకు వస్తుంది. అవసరమైతే కొద్దిగా నీరు పోసి, మూత పెట్టి మరో 10 నిమిషాలు లేదా చికెన్ 80శాతం ఉడికే వరకు ఉంచాలి.
-చికెన్ ఉడికిన తర్వాత చివరగా చిన్న ముక్కలుగా కోసిన క్యాప్సికమ్ ను వేసి కలపాలి. క్యాప్సికమ్ మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మరియు చివరగా నల్ల మిరియాల పొడి చల్లాలి.
-మసాలాలన్నీ వేసాక మరో 2-3 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన చికెన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications