Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
బోరింగ్ చట్నీలకు గుడ్ బై..వెల్కమ్ కొత్తిమీర కారప్పచ్చడి..ఇడ్లీ, దోశెల రుచి రెట్టింపు
ఉదయం టిఫిన్‌లోకి వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే దోశలు.. వాటికి జతగా ఎప్పుడూ చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ తిని విసుగొచ్చిందా? కొంచెం కొత్తగా, కారంగా, పుల్లగా, కమ్మగా ఉండే ఓ అద్భుతమైన చట్నీని ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే కొత్తిమీర కారప్పచ్చడి ట్రై చేయాల్సిందే.
కేవలం కొత్తిమీర మాత్రమే కాదు, కరివేపాకు సువాసన కూడా జతచేరి దీని రుచిని రెట్టింపు చేస్తుంది. ఈ పచ్చడి ఘుమఘుమలు మీ ఇంటినంతా నింపేస్తాయి. ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, చేయడం కూడా చాలా సులభం. కొత్తిమీర కారప్పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎండు మిరపకాయలు - 10
కొత్తిమీర - ఒక పెద్ద గుప్పెడు
కరివేపాకు - ఒక కట్ట
చింతపండు - చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి రెబ్బలు - 4
వంట నూనె - 2 చెంచాలు
ఆవాలు - అర చెంచా
ఉప్పు-రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా బాండీని స్టవ్‌పై పెట్టి అందులో ఒక చెంచా నూనె వేసి వేడిచేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు వేసి, అవి మంచి రంగు వచ్చేవరకు, ఘాటైన సువాసన వెదజల్లే వరకు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేటులో పెట్టి చల్లారనివ్వండి.
-ఇప్పుడు అదే బాణలిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కొత్తిమీర, కరివేపాకు వేయండి. మంటను చిన్నగా పెట్టి ఆకుల్లోని తేమ పోయి, అవి కొద్దిగా ముడుచుకుని, కరకరలాడే వరకు ఓ రెండు నిమిషాలు వేయించాలి. దీనిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వేయించిన ఎండు మిరపకాయలు, చల్లారిన కొత్తిమీర-కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మీకు కావలసినంత జారుగా వచ్చేవరకు నీటిని సర్దుబాటు చేసుకోండి.
-ఇప్పుడు ఈ రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-తాలింపు కోసం చిన్న పాన్ లో చెంచా నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు వేయండి. ఆవాలు చిటపటలాడి, పప్పు బంగారు రంగులోకి మారగానే, ఈ తాలింపుని పచ్చడిపై వేసి బాగా కలపండి.
-అంతే నోరూరించే, ఘుమఘుమలాడే కొత్తిమీర కారం పచ్చడి రెడీ. వేడివేడి ఇడ్లీలు, దోశెలు లేదా ఉప్మాతో ఈ పచ్చడి రుచి చూశాక, మీ కుటుంబ సభ్యులు టిఫిన్ కంటే ఎక్కువగా ఈ పచ్చడి కోసమే ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications