Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
తందూరీ చికెన్..ఇలా చేసి తింటే స్వర్గానికి బెత్తెడే దూరం!
తందూరీ చికెన్ అనేది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. దీని ఎర్రటి రంగు, స్మోకీ వాసన, అద్భుతమైన మసాలా రుచి దీనిని నాన్ వెజ్ ప్రియుల ఫేవరెట్ డిష్ గా మార్చాయి.
తందూరీ చికెన్ మూలాలు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా దీనిని తందూర్ అని పిలువబడే మట్టి పొయ్యిలో వండుతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే, ఇప్పుడు ఓవెన్ లు లేదా గ్యాస్ స్టవ్ ల మీద కూడా అదే రుచితో దీనిని తయారు చేసుకోవచ్చు.

ఈ ఆదివారం మీ ఇంట్లోనే తక్కువ ఆయిల్ తో రెస్టారెంట్ ని మించిన రుచితో తందూరీ చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెద్ద సైజు చికెన్ ముక్కలు
-పెరుగు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-పసుపు
-ఉప్పు
-కసూరి మేతీ
-గరం మసాలా
-చికెన్ మసాలా
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-నూనె
-నెయ్యి
-నిమ్మరసం
తయారీ విధానం
-ముందుగా 1 కేజీ చికెన్ ముక్కలు(పెద్ద సైజువి)శుభ్రంగా కడగాలి.
-ఒక బౌల్ లో కడిగిన చికెన్ ముక్కలు వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ , 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, 1 టీస్పూన్ చికెన్ మసాలా, ముప్పావు కప్పు పెరుగు, అర బద్ద నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కసూరి మేతి నలిపి వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా చేతులతో బాగా కలుపుకోవాలి.
-కలుపుకునేటప్పుడు చికెన్ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి కలుపుకోండి. బాగా కలుపుకున్నాక బౌల్ మీద మూత పెట్టి దీనిని 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి.
-4 గంటల తర్వాత కుక్కర్ లో మసాలా కలిపిన చికెన్ ముక్కల మిశ్రమం వేసి మూతపెట్టి స్టవ్ మీద పెట్టి పెద్ద మంట మీద 1 విజిల్ వచ్చేదాకా ఉడికించాలి.
-1 విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి మళ్లీ స్టవ్ ఆన్ చేసి పెద్ద మంట మీద చికెన్ మిశ్రమంలోని నీరు ఇగిరిపోయేదాకా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెను కుక్కర్ లోని చికెన్ ముక్కల మధ్యలో పెట్టండి. ఆ గిన్నెలో ఒక కాల్చిన బొగ్గు వేయండి. బొగ్గు మీద కొంచెం నెయ్యి కూడా వేసి ఆ ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టేయండి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి బొగ్గు పెట్టిన గిన్నెను బయటకు తీసేయండి.
-ఇప్పుడు పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి దాని మీద చికెన్ ముక్కలను పెట్టి అన్నివైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే తందూరీ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications