Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం..సూపర్ టేస్టీ అవకాడో పరాఠా చేసుకోండిలా..
కొన్నేళ్ల క్రితం వరకు మనలో చాలా మందికి అవకాడో అంటే పెద్దగా పరిచయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత ఈ పండు కోసం సూపర్ మార్కెట్లలో వెతికి మరీ కొనుక్కుంటున్నారు. దీనికి ముఖ్య కారణం అవకాడోలో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలే.
చర్మాన్ని మెరిపించడంలో అవకాడో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడం, రక్తపోటును నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా అవకాడోను సలాడ్లలోనో లేదా బ్రెడ్ టోస్ట్ మీదో వేసుకుని తింటారు. కానీ మన భారతీయ రుచులకు తగ్గట్టుగా దీనితో పరాఠా చేసుకుంటే ఆ రుచే వేరు. ఆరోగ్యకరమైన, రుచికరమైన అవకాడో పరాఠా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
అవకాడో: 1
ఆకుకూరలు: 1 కప్పు (మెంతి కూరలేదా పాలకూర)
పచ్చిమిర్చి: 1
మిరియాల పొడి: పావు టీస్పూన్
జీలకర్ర పొడి: అర టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్: కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర లేదా మెంతి కూర, పచ్చిమిర్చి ముక్కలను వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
-కలిపిన పిండిపై మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పరాఠాలు మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు అవకాడో పండును తీసుకుని దాని తొక్క తీసి, లోపల ఉన్న గుజ్జును ఒక గిన్నెలో వేసి మెత్తగా మాష్ చేయాలి. అవకాడో గాలి తగలగానే నల్లగా మారుతుంది కాబట్టి వెంటనే అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఇదే పరాఠా స్టఫింగ్.
-తర్వాత పక్కన పెట్టిన పిండిని తీసుకుని సమాన భాగాలుగా (ఉండలుగా) చేసుకోవాలి.
-ఒక పిండి ముద్దను తీసుకుని చేతితో చిన్న గిన్నెలా లేదా చిన్న పూరీలా ఒత్తుకుని, మధ్యలో అవకాడో మిశ్రమాన్ని (స్టఫింగ్) ఉంచాలి. పిండి అంచులను దగ్గరకు చేర్చి, స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా మూసివేయాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ పరాఠా చిరిగిపోకుండా నెమ్మదిగా గుండ్రంగా ఒత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కాక పరాఠాను వేసి రెండు వైపులా నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ రాస్తూ, సన్నని మంటపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. మంట తక్కువగా ఉంటే పరాఠా లోపల వరకు ఉడికి కరకరలాడుతూ వస్తుంది.
-వేడివేడిగా తయారైన ఈ అవకాడో పరాఠాలను గట్టి పెరుగుతో గానీ, పుదీనా చట్నీతో గానీ వడ్డిస్తే రుచి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications