Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇడ్లీ, దోశెల రుచిని రెట్టింపు చేసే..టమాటో అల్లం చట్నీ..ఒక్కసారి తిన్నారంటే వదలరు!
తెలుగువాళ్లు ఎక్కడున్నా పొద్దున్నే ఎక్కువగా తినే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ,దోశలు ఉంటాయి. ఇవి తయారుచేయడం ఒక ఎత్తైతే, వాటికి రోజూ ఓ కొత్తరకం పచ్చడి చేయడం మరో ఎత్తు. ఎప్పుడూ చేసే కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ తిని బోర్ కొట్టిందా? టిఫిన్ రుచిని రెట్టింపు చేసే ఒక సరికొత్త సైడ్ డిష్ కోసం చూస్తున్నారా? అయితే టమాటో అల్లం చట్నీ ట్రై చేయాల్సిందే.
సాధారణంగా మనం చేసుకునే టమాటో చట్నీకి ఇది పూర్తి భిన్నం. పులుపు, కారం, తీపి, కొద్దిగా వగరు కలగలిపి నాలుకకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో వాడే వేరుశనగపప్పు, మినపప్పు, అల్లం, బెల్లం వంటి పదార్థాలు దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఈ చట్నీ ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. ఘుమఘుమలాడే టమాటో అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు
పండిన టొమాటోలు- 2
ఎండు మిరపకాయలు- 5
వేరుశనగపప్పు (పల్లీలు)- 1 టేబుల్ స్పూన్
మినపప్పు- 1 టీ స్పూన్
అల్లం-చిన్న అంగుళం ముక్క
బెల్లం - చిన్న ముక్క
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
నూనె - తాలింపు కోసం 1 టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - ఒక రెబ్బ
తయారీ విధానం
-ముందుగా టొమాటోలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అల్లం పై తొక్క తీసి సిద్ధంగా ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక మినపప్పు, వేరుశనగపప్పు, ఎండు మిరపకాయలు వేసి చిన్న మంట మీద దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-వేయించుకున్న పప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలో తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలు, అల్లం వేసి.. టొమాటోలు మెత్తబడి, పచ్చి వాసన పోయేవరకు బాగా మగ్గించుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో చల్లారిన పప్పుల మిశ్రమం, మగ్గించిన టొమాటో-అల్లం, కొబ్బరి తురుము, చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి.
-చివరగా తాళింపు కోసం చిన్న పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఈ ఘుమఘుమలాడే పోపును చట్నీలో కలిపితే నోరూరించే, సరికొత్త రుచితో టమాటోఅల్లం చట్నీ రెడీ.
-ఈ చట్నీ వేడి వేడి ఇడ్లీ, మెత్తని దోసెలు, గారెలు, ఊతప్పం దేనితో తిన్నా దీని రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications