Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వీకెండ్ స్పెషల్..స్మోకీ ఫ్లేవర్ తో అదిరిపోయే తందూరీ బిర్యానీ..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఎప్పుడూ తినే రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఈ వీకెండ్ లో కాస్త కొత్తగా, స్పెషల్ గా ఏదైనా రుచి చూడాలనుకుంటున్నారా? అయితే తందూరీ చికెన్ బిర్యానీ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. సాధారణ బిర్యానీ మసాలాల ఘుమఘుమలకు, తందూరీ స్మోకీ రుచి తోడైతే.. ఆ రుచి అద్భుతమే.
రెస్టారెంట్లలో మాత్రమే దొరికే ఈ వెరైటీని మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ తందూరీ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు
గట్టి పెరుగు - అర కప్పు
తందూరీ మసాలా - 2 టీస్పూన్లు
కారం - 1 టీస్పూన్
పసుపు -అర టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
బాస్మతి బియ్యం - 2 కప్పులు
నీళ్లు - 4 కప్పులు
బిర్యానీ ఆకులు - 2
లవంగాలు - 3-4
యాలకులు - 2-3
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - 1 పెద్దది
కొత్తిమీర - 2 టీస్పూన్లు
పుదీనా - 1 టీస్పూన్
కుంకుమపువ్వు పాలు - అర కప్పు
నెయ్యి - 1 టీస్పూన్
బొగ్గు ముక్క - 1

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకుని అందులో పెరుగు, తందూరీ మసాలా, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా లేదా కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టేయండి.
-తర్వాత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక నానబెట్టిన బియ్యం వేసి అన్నం 80శాతం ఉడికే వరకు మెతుకు విరిస్తే విరిగేలా ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టి అన్నాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ ముక్కలను వేసి వేయించాలి. చికెన్ ముక్కలు రెండు వైపులా ఎర్రగా కాలి, తందూరీ టెక్స్చర్ వచ్చే వరకు 5-7 నిమిషాలు మీడియం మంటపై వేయించాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే 180°C వద్ద 15-20 నిమిషాలు బేక్ చేసుకోవచ్చు.
-తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అడుగున సగం బిర్యానీ రైస్ పరచాలి. దానిపై వేయించిన తందూరీ చికెన్ ముక్కలను లేయర్ లా వేయాలి. చికెన్ పైన మిగిలిన అన్నాన్ని పరచాలి.
-చివరగా పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా చల్లి, కుంకుమపువ్వు పాలు, నెయ్యి వేయాలి. గిన్నెపై మూత పెట్టి సన్నని మంటపై 15-20 నిమిషాలు దమ్ చేయాలి.
-బిర్యానీ రెడీ అయ్యాక స్టవ్ ఆపేయండి. బిర్యానీ మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నె ఉంచండి. స్టవ్ మీద ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్కను ఆ చిన్న గిన్నెలో వేసి, దానిపై అర స్పూన్ నెయ్యి వేయండి. వెంటనే పొగ రావడం మొదలవుతుంది. ఆ పొగ బయటకు పోకుండా వెంటనే బిర్యానీ గిన్నెపై మూత గట్టిగా పెట్టేయండి.
-ఈ పొగ వాసన బిర్యానీకి అచ్చం హోటల్ స్టైల్ తందూరీ రుచిని ఇస్తుంది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో రుచికరమైన, ఘమఘమలాడే తందూరీ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications