Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
విటమిన్లు, మినరల్స్ పుష్కలం.. బరువు తగ్గించే అద్భుతమైన బ్రోకలీ పులావ్!
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? డైటింగ్ పేరుతో రోజూ తినే చప్పని ఆహారంతో విసిగిపోయారా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే బ్రోకలీ పులావ్ మీ డిన్నర్ ప్లేట్ లో ఉండి తీరాల్సిందే. బ్రోకలీ పులావ్, చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ను పుష్కలంగా అందిస్తుంది.
బ్రోకలీలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ డిన్నర్ అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన బ్రోకలీ పులావ్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: 1 కప్పు
బ్రోకలీ: 1 కప్పు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2-3
అల్లం: చిన్న ముక్క
మసాలా దినుసులు: జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1-2 టేబుల్ స్పూన్లు
నీళ్లు: 2 కప్పులు
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల బియ్యం పొడిపొడిగా, మృదువుగా ఉడుకుతుంది. బియ్యం నానేలోపు మీరు కూరగాయలను కట్ చేసి పెట్టుకోవచ్చు.
-స్టవ్ వెలిగించి, కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత అల్లం తురుము, పచ్చిమిర్చి చీలికలు వేసి మరో నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలను వేసి, తక్కువ మంటపై 2-3 నిమిషాలు వేయించండి. బ్రోకలీ మరీ మెత్తగా ఉడకకూడదు,పచ్చి వాసన పోయేలా వేయిస్తే సరిపోతుంది.
-నానబెట్టిన బియ్యంలోని నీటిని వంచేసి, బియ్యాన్ని పాత్రలో వేయండి. దీనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు జత చేయండి. ఇప్పుడు బియ్యం గింజలు విరిగిపోకుండా చాలా నెమ్మదిగా మసాలాలతో కలిసేలా కలపండి.
-ఇప్పుడు 2 కప్పుల నీళ్లు (1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు లేదా మీ బియ్యం రకాన్ని బట్టి) పోసి మూత పెట్టండి. ప్రెజర్ కుక్కర్ అయితే 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. సాధారణ గిన్నె అయితే నీరు ఆవిరైపోయి అన్నం ఉడికే వరకు మూత పెట్టి ఉంచండి.
-అన్నం ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా స్టవ్ ఆపి 5 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నెమ్మదిగా మూత తీసి, ఫోర్క్ లేదా గరిటెతో అన్నాన్ని పైకి కిందికి మెల్లగా అనండి. దీనివల్ల పులావ్ ముద్దవ్వకుండా పొడిపొడిగా ఉంటుంది.
-వేడి వేడి బ్రోకలీ పులావ్ ను పెరుగు రైతా, దోసకాయ సలాడ్ లేదా పాపడ్ తో కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. వడ్డించే ముందు పైన కాస్త కొత్తిమీర చల్లుకుని, కావాలంటే మరో అర స్పూన్ నెయ్యి వేసుకుంటే, ఆ రుచిని మీరు అస్సలు మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications