Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
చల్లటి వాతావరణంలో లేదా వర్షం పడుతున్న సాయంత్రాల్లో వేడి వేడిగా, ఘుమఘుమలాడే సూప్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అందులోనూ అది మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడే మటన్ షోర్బా అయితే.. ఆ మజాయే వేరు. నోటికి రుచిగా తగలడమే కాకుండా, శరీరానికి ఎంతో బలాన్నిచ్చే అద్భుతమైన, సాంప్రదాయ వంటకం ఇది. మసాలా దినుసుల సువాసనలతో, మటన్ ముక్కల లేత రుచితో కలగలిసిన ఈ మటన్ షోర్బాను ఇంట్లోనే దాబా స్టైల్ రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మటన్ షోర్బా తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
అల్లం ముక్క - 1 అంగుళం
పచ్చిమిర్చి - 4
పుదీనా ఆకులు - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 15
నీళ్లు - పావు కప్పు
మటన్ - 700 గ్రాములు (ఎముకలతో ఉన్న లేత మాంసం)
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
లవంగాలు - 6
యాలకులు - 4
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2
పసుపు - అర టీస్పూన్
నీళ్లు - 2 నుంచి 3 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గుప్పెడు
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
మటన్ షోర్బా తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చటి మసాలానే షోర్బాకు అసలైన రుచిని, సువాసనను ఇస్తుంది.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లేదా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేయడం వల్ల షోర్బాకు కమ్మని వాసన వస్తుంది. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత గోధుమ రంగులోకి మారేంత వరకు దోరగా వేయించాలి.
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు, పసుపు వేసి బాగా కలపాలి. మటన్ లో నీరు ఇగిరిపోయి, నూనె పైకి తేలేవరకు ఓపికగా 5-7 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేలా చిన్న మంట మీద మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
-మసాలా అంతా మటన్ ముక్కలకు బాగా పట్టిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, 2-3 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మటన్ లేతదనాన్ని బట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అప్పుడే మటన్ లోని సారం అంతా సూప్ లోకి దిగుతుంది.
-ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే.. నూనె పైకి తేలుతూ గుమగుమలాడే మటన్ షోర్బా మిమ్మల్ని నోరూరిస్తుంది. దీని పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సరిపోతుంది.
-ఈ వేడి వేడి మటన్ షోర్బాను కేవలం సూప్ లాగే కాకుండా.. బగారా రైస్, బిర్యానీ, పులావ్ లేదా వేడి వేడి నాన్, తందూరీ రోటీతో తింటే ఆ రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications