Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
జలుబు,దగ్గు,జ్వరానికి దివ్యౌషధం..మిరియాల అన్నం ఇలా చేసుకుంటే కేక అంతే
మనదేశంలో ముఖ్యంగా దక్షిణ బారతదేశంలో తరచుగా తయారుచేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల్లో మిరియాల అన్నం ఒకటి. మిరియాలు దాని ఘాటైన రుచి, ఔషధ గుణాల కారణంగా ఈ వంటకానికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తాయి. మిరియాలలో పెపరిన్ అనే శక్తివంతమైన రసాయనం ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మిరయాల అన్నం ముఖ్యంగా చలికాలంలో లేదా జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ ఫుడ్ గా పరిగణించబడుతుంది.
మిరియాల అన్నం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, దీనిని మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనంలో తీసుకోవచ్చు. నెలకొకసారైనా లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడైనా ఈ సులభమైన, పోషక విలువలు కలిగిన మిరియాల అన్నం రెసిపీని ప్రయత్నించడం మంచిది. ఇది కడుపు నొప్పి మరియు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం, చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది. లంచ్ బాక్సుల్లో పట్టుకెళ్లడానికి కూడా బాగుంటుంది. మిరియాల అన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిరియాల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిరియాలు
-జీలకర్ర
-బాస్మతి బియ్యం
-పచ్చిమిరపకాయ
-కరివేపాకు
-నెయ్యి
-కొత్తిమీర
-జీడిపప్పు
మిరియాల అన్నం తయారీ విధానం
-ముందుగా 1 కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగాక అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీలో రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. మిరియాలు పలుకుగా లేకుండా దంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేశాక అందులో 15 జాడిపప్పు పలుకులు, 1 రెమ్మ కరివేపాకు తురుము, 1 పచ్చిమిరపకాయ చీలికలు వేసి సన్నని సెగ మీద వేయించుకోవాలి.
-తర్వాత అందులో ముందుగా దంచి ఉంచుకున్న మిరియాల జీలర్ర పొడిని వేసి నేతిలో మంచిగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో ఉడికిన బాస్మతి రైస్ వేసి,రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి.
-మొత్తం కలిసిపోయిన తర్వాత మంటను పెంచి అన్నం పొగలు కక్కేదాకా కలుపుతూ ఉండాలి.
-చివరిగా కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ మిరియాల అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications