Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పోపు అవసరం లేని చట్నీ...రుచి మాత్రం అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే..
మన ఇళ్లలోబ్రేక్ ఫాస్ట్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది వేడివేడిగా, ఆవిర్లు కక్కే ఇడ్లీ. ఆ మెత్తటి ఇడ్లీలలోకి ఓ మంచి ఘాటైన, పుల్లపుల్లని చట్నీ లేకపోతే ఆ మజానే రాదు కదా? అయితే, రోజూ అదే రకం టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి తిని విసుగొచ్చిందా? మీ రుచిని కొత్త పుంతలు తొక్కించే ఒక అద్భుతమైన చట్నీ కోసం చూస్తున్నారా? రోడ్ల మీద టిఫిన్ బండ్ల దగ్గర, ట్రాలీ షాపుల్లో ఇడ్లీతో పాటు ఒక ప్రత్యేకమైన చట్నీ వడ్డిస్తారు. దాని వాసన, రుచి మనల్ని కట్టిపడేస్తాయి. అదే టమాటో పుదీనా ఉల్లి చట్నీ
కమ్మటి వాసనతో, కాస్త కారంగా, పుల్లగా ఉండే ఆ చట్నీ రుచే వేరు. ఈ చట్నీ ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్లకు పెట్టారంటే చాలు, మామూలుగా తినే నాలుగు ఇడ్లీల బదులు ఆరు ఇడ్లీలు లాగించేస్తారు. ఏంటీ ఈ చట్నీ అద్భుతంగా ఉంది మళ్లీ ఎప్పుడు చేస్తావ్? అని అడగడం ఖాయం. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఘుమఘుమలాడే టమాటో పుదీనా ఉల్లి చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

నూనె - 2 టీస్పూన్లు
ఎండుమిర్చి - 3
పెద్ద ఉల్లిపాయ - 1
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిర్చి - 3-5
పండు టమాటా - 1
కరివేపాకు - 2 రెబ్బలు
పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
కారం -పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరమైనంత
తయారుచేసే విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టాలి.
-ఇప్పుడు అదే నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గులాబీ రంగులోకి మారి, పారదర్శకంగా అయ్యేవరకు చక్కగా వేపాలి.ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి వాసన పోయేవరకు ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసి, టమాటాలు మెత్తగా మగ్గిపోయే వరకు మూతపెట్టి ఉడికించాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కరివేపాకు, పుదీనా ఆకులు వేసి, ఆకులు వాడిపోయే వరకు ఒకటి రెండు నిమిషాలు వేపాలి.
-చివరగా, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి వేసి బాగా కలిపి మరో నిమిషం వేయిస్తే పచ్చి వాసన పోతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు కలుపుకుంటే చాలు అంతే ఘుమఘుమలాడే టమాటా పుదీనా ఉల్లి చట్నీ రెడీ. ఈ చట్నీని వేడివేడి ఇడ్లీ, దోశ లేదా గారెతో తింటే కేక అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications