Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బలం, రుచి రెండూ కావాలా? తోటకూర చికెన్ కర్రీ తినాల్సిందే...ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలాగే శరీరానికి కావలసిన ప్రోటీన్ అందించడంలో చికెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండింటి కలయికతో చేసే వంటకమే తోటకూర చికెన్.
ఇది కేవలం రుచికరమైన కర్రీ మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన విటమిన్లు,మినరల్స్, ప్రోటీన్లను అందించే ఒక పవర్ ప్యాక్డ్ ఆహారం. తోటకూర చికెన్ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో చాలా ఫేమస్. అన్నం, చపాతీ లేదా రాగి సంకటిలోకి ఇది చాలా రుచిగా ఉంటుంది. తోటకూర చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్: 500 గ్రాములు
తోటకూర: 3-4 పెద్ద కట్టలు
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 3-4
టమాటా: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం: 1- 2 టేబుల్ స్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం
కరివేపాకు: 2 రెమ్మలు
లవంగాలు-2
ఏలకులు-2
దాల్చిన చెక్క-చిన్న ముక్క
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తోటకూరను కూడా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి, నీరు వడకట్టి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేయాలి. అవి వేగాక, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు సుమారు 2 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను కడాయిలో వేయాలి. దీనికి పసుపు, కొద్దిగా ఉప్పు జత చేసి బాగా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై 5-10 నిమిషాలు ఉడికించాలి. చికెన్ నుండి నీరు బయటకు వచ్చి, అది ఇగిరిపోయే వరకు ఉడికించాలి.
-చికెన్ సగం ఉడికిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన తోటకూరను చికెన్ మిశ్రమంలో వేయాలి. మొదట్లో ఆకుకూర ఎక్కువగా కనిపించినా, ఉడికే కొద్దీ దగ్గరకు అవుతుంది. ఆకుకూరలోని నీరు చికెన్ కు మంచి రుచిని ఇస్తుంది. అవసరమైతే చిన్న గ్లాసు నీరు పోసుకోవచ్చు.
-కూర దగ్గర పడ్డాక గరం మసాలా పొడి వేసి కలపాలి. నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన తోటకూర చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications