Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే..
వేసవి కాలంలో ఉదయం నిద్రలేవగానే ఎండ వేడికి ఏదైనా చల్లగా, కడుపుకు హాయిగా ఉండే అల్పాహారం తినాలనిపిస్తుంది కదూ. రోజూ మనం తినే ఇడ్లీ, దోశ, పరాటాలు, బ్రెడ్ వంటి బరువైన అల్పాహారాలతో విసిగిపోయి ఉంటే.. మీ పొట్టకు విశ్రాంతినిస్తూనే, శరీరానికి కావలసిన శక్తిని అందించే అద్భుతమైన వంటకం ఒకటుంది. అదే దహీ పోహా (పెరుగు అటుకులు). పెరుగు చల్లదనం, తేలికపాటి అటుకుల కలయికతో తయారయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్ మీ రోజును ఎంతో ఉత్సాహంగా మారుస్తుంది. ఇది తినడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించదు, మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. పైగా ఉదయం హడావిడిలో కేవలం నిమిషాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు.

దహీ పోహా తయారీకి కావలసిన పదార్థాలు
మందపాటి అటుకులు (పోహా) - 2 కప్పులు
కమ్మని తాజా పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
టమోటా - 1
పచ్చిమిర్చి - 1
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర- 1 టేబుల్ స్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు-తగినంత
నిమ్మరసం - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - 5 ఆకులు
ఎండు మిరపకాయ - 1
దహీ పోహా తయారీ విధానం
-దహీ పోహా చేయడం చాలా సులభం. ముందుగా ఒక జల్లెడ లేదా చిల్లుల గిన్నె తీసుకుని, అందులో రెండు కప్పుల మందపాటి అటుకులు వేయండి. వాటిని మంచి నీటితో తేలికగా కడిగి, సుమారు 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తబడతాయి. అటుకులను నీటిలో నానబెట్టకండి, అలా చేస్తే అవి ముద్దగా, జిగురుగా మారిపోయి రుచి పాడవుతుంది.
-ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో కప్పు తాజా పెరుగు వేసి క్రీమ్ లాగా మృదువుగా గిలకొట్టండి. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు మెత్తబడిన అటుకులను ఈ పెరుగు మిశ్రమంలో వేసి, విరిగిపోకుండా సున్నితంగా కలపండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, వేయించిన క్రంచీ పల్లీలు, కొత్తిమీర ఆకులను వేసి అన్నీ కలిసేలా నెమ్మదిగా కలపాలి.
-దహీ పోహాకు అసలైన రుచినిచ్చేది తాలింపే. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి, నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు, ఎండు మిరపకాయ వేసి దోరగా వేయించి స్టవ్ ఆపేయండి.
-గుమగుమలాడే తాలింపును సిద్ధం చేసుకున్న పెరుగు అటుకుల మిశ్రమంపై పోసి బాగా కలపండి. చివరగా కొంచెం నిమ్మరసం కలుపుకుంటే దహీ పోహా తినడానికి రెడీ.
-దీన్ని మరింత ఆకర్షణీయంగా, రుచిగా మార్చాలనుకుంటే పైన కొద్దిగా దానిమ్మ గింజలు లేదా బూందీ చల్లుకుని సర్వ్ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
