నోరూరించే నూనె వంకాయ గ్రేవీ..ప్రతి ముద్దలో అద్భుతమైన రుచి..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మధ్యాహ్న భోజనానికి వేడి వేడి అన్నంలోకి ఏం కూర వండాలా అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో వంకాయలు ఉన్నాయా? అయితే రోజూ చేసే వంకాయ కూరలకు భిన్నంగా, ఓసారి ఈ అద్భుతమైన నూనె వంకాయ గ్రేవీని ప్రయత్నించండి. ఈ కూర చూడటానికి ఎంత గొప్పగా ఉంటుందో, తినడానికి అంతకంటే అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే సువాసనకే సగం కడుపు నిండిపోతుంది. టేస్టీ నూనె వంకాయ కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేత గుండ్రాటి వంకాయలు- 300 గ్రాములు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
సాంబార్ ఉల్లిపాయలు - 10
వెల్లుల్లి రెబ్బలు - 10
టమోటా - 1
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
చింతపండు - పెద్ద నిమ్మకాయంత
చిక్కటి కొబ్బరి పాలు - అర కప్పు
బెల్లం - చిన్న ముక్క

Tired of the usual Brinjal Curry Try this delicious Nune Vankaya Gravy Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసి లేదా కాయకు గాట్లుగా పెట్టి ఉప్పు కలిపిన నీటిలో వేయాలి.

-ఇప్పుడు స్టవ్‌ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత నీటిలో నుంచి తీసిన వంకాయ ముక్కలను వేసి కొద్దిగా ఉప్పు చల్లి, అవి మెత్తబడి బంగారు రంగులోకి వచ్చేవరకు మీడియం మంటపై వేయించుకుని, ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే బాండీలో మిగిలిన నూనెలో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత, టమోటా ముక్కలు వేసి పూర్తిగా మగ్గనివ్వాలి.

టమోటాలు మెత్తబడ్డాక, జీలకర్ర, మిరియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి, స్టవ్ ఆపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌ లోకి తీసుకుని దాంట్లోనే కారం, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ కారం పొడి వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

Take a Poll

ఇప్పుడు స్టవ్‌ పై అదే బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేయించాలి.

తాలింపు వేగిన వెంటనే మనం గ్రైండ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. మసాలా బాగా వేగిన తర్వాత చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు 5 నిమిషాల పాటు మరిగించాలి.

గ్రేవీ చిక్కబడ్డాక వేయించి పక్కన పెట్టుకున్న గాట్లు పెట్టిన వంకాయలు లేదా వంకాయ ముక్కలు, చిన్న బెల్లం ముక్క, కొబ్బరి పాలు వేసి నెమ్మదిగా కలపాలి. బెల్లం వేయడం వల్ల పులుపు, కారం బ్యాలెన్స్ అవుతాయి.

ఇప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి, నూనె పైకి తేలేంత వరకు సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే నూనె వంకాయ గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 3, 2025, 16:08 [IST]
Desktop Bottom Promotion