భారీగా పెరిగిన టమాటో ధరలు.. కూరల్లో టమాటోకు బదులుగా ఇవి వినియోగించుకోవచ్చు!

Posted By:

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే టమాటో, ఉల్లిగడ్డ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజలు కొనాలంటేనే ఒకటి రెండు సార్లు ఆలోచించేలా వాటి ధరలు రోజుకు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.30-40 వరకు ఉన్న టమాటో ధర.. ఇప్పుడు ఏకంగా రూ.60-100 వరకు పలుకుతోంది.

ఉల్లిగడ్డ ధర కూడా ఒక కిలో సెంచరీకి చేరువలో ఉంది. అయితే తెలుగు వారి వంటల్లో తప్పనిసరిగా ఉండే టమాటో ధర పెరిగిపోవడంతో.. ప్రజలు అయోమయంలో పడ్డారు. టమాటో లేకపోతే కూరలు రుచి ఉండవుకాబట్టి కష్టమైన భారంగా ఉన్నా.. వాటినే కొనుక్కొని తింటున్నారు.

Tomato alternatives for curries amid price surge in Telugu States

అందుకే పెరిగిన టమాటో ధరలను దృష్టిలో ఉంచుకొని.. టమాటోకి ప్రత్యామ్నాయంగా కొన్ని వస్తువులను వంటల్లో వేసుకోవచ్చు. తద్వారా ఖర్చు కొంతమేర తగ్గడంతో పాటు, టమాటో రుచిని కూడా ఆస్వాదించినట్లు అవుతుంది. అయితే ఆ ప్రత్యామ్నాయ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటోకు ప్రత్యామ్నాయ పదార్థాలు

చింతపండు: మన వంటల్లో టమాటోకు బదులుగా చింతపండును వినియోగించవచ్చు. తద్వారా టమాటోకు సరిపడ పుల్లనైన రుచి రావడంతో పాటు వంటలు కూడా చాలా రుచి కరంగా ఉంటాయి.

Tomato alternatives for curries amid price surge in Telugu States

పుల్లటి పెరుగు: టమోటాను ప్రత్యామ్నాయంగా మన ఇంట్లోనే దొరికే పుల్లటి పెరుగును వంటల్లో వేసుకోవచ్చు. దీని ద్వారా మనకు టమాటో సరిపడ మంచి రుచితో పాటు చక్కటి ఆహారాన్ని పొందవచ్చు.

గుమ్మడి కాయ: తెలుగువారి వంటల్లో గుమ్మడి కాయ వంటకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఆ గుమ్మడి కాయను మన రోజువారీ వంటల్లో టమాటోకు బదులుగా వినియోగించుకోవచ్చు.

Tomato alternatives for curries amid price surge in Telugu States

పచ్చి మామిడి: పప్పు, చేపల కూరల్లో ఎక్కువగా వినియోగించే పచ్చి మామిడిని.. మనం మన రోజువారీ వంటల్లో టమాటోకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చు. టమాటో రుచితో పాటు, పుల్లటి మామిడి రుచిని ఆస్వాదిస్తూ ఒక్కో ముద్ద తింటుంటే.. ఆహా అనాంల్సిందే.

వీటితో పాటు మందారపువ్వు, వేయించిన బెల్ పెప్పర్స్, వెనిగర్ కూడా టమాటోకు బదులుగా మన వంటల్లో వినియోగించుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మనకు కావాల్సిన టమాటో రుచిని చక్కగా అందిస్తాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion