Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సాధారణంగా స్నాక్స్ అనగానే అందరికీ ఇష్టమైనవి క్రంచీగా ఉండే చక్లీలే. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఫ్లేవర్లలో చక్లీలు దొరుకుతున్నాయి. కానీ ఎప్పుడూ ఒకే రకమైన చక్లీ తిని బోరు కొట్టిందా? అయితే కొంచెం వెరైటీగా, ఎంతో రుచికరంగా ఉండే టమాటా చక్లీని(టమాటో మురుకు) ఎప్పుడైనా ట్రై చేశారా?
టమాటాల పులుపు, ఎండుమిర్చి కారం కలగలిసిన చక్లీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. కరకరలాడే టమాటా చక్లీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

టమాటా చక్లీ తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం పిండి - 3 కప్పులు
శనగ పిండి - అర కప్పు
ఎర్రటి టమాటాలు - 3 (మీడియం సైజు)
ఎండు మిర్చి - మీ కారానికి తగినన్ని
జీలకర్ర - 1 టీస్పూన్
వాము - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
కరిగించిన వెన్న - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
టమాటా చక్లీ తయారు చేసే విధానం
-ముందుగా టమాటాలను కడిగి, మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన టమాటాలు, ఎండు మిర్చి,కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టాలి. మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
-ఉడికిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక పైనున్న తొక్కను తీసేయాలి. ఇప్పుడు టమాటాలు, ఎండుమిర్చిని మిక్సీ జార్ లో వేసి నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని, అందులో బియ్యం పిండి, శనగ పిండి వేసుకోవాలి. ఇందులో వాము, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కరకరలాడటం కోసం కరిగించిన వెన్నను వేసి పిండిని చేతితో బాగా మిక్స్ చేయాలి. పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా అయ్యేంత సాఫ్ట్ గా ఉండాలి.
-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్‌ను ఒక జల్లెడ సహాయంతో వడకట్టి ఆ పిండిలో వేసుకోవాలి. టమాటాలు ఉడికించిన నీటిని కూడా కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మృదువుగా కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి.
-స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయాలి. చక్లీల అచ్చు తీసుకుని, అందులో ఈ పిండిని పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, పిండిని నేరుగా నూనెలో లేదా ఒక ప్లేట్ మీద ఒత్తుకుని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, కరకరలాడే వరకు వేయించి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన టమాటా చక్లీ రెడీ. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications