For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో రైస్ రిసిపి

Posted By: Mallikarjuna
|
టామోటా రైస్ రిసిపి | Tomato Rice Recipe | Tomato Bhath Recipe | Boldsky

టమోటో రైస్ రిసిపి. ఇది ఒక ట్రెడిషినల్ రిసిపి . ముఖ్యంగా సౌంత్ ఇండియన్ వంటకాల్లో టమోటో రైస్ ఒకటి. దీన్ని రెగ్యులర్ మీల్స్ గా తయారుచేసుకుంటారు. చాలా సింపుల్ గా , సులభంగా, తగిన మసాలాలు జోడించి మంచి ఫ్లేవర్డ్ రైస్ లా తయారుచేసుకుంటారు. అందుకు బియ్యం, టమోటోలు, కొన్ని పోపు దినుసులు ఉపయోగిస్తారు.

టమోటో రైస్ వివిధ రకాల ఫ్లేవర్ తో తయారుచేసుకుంటారు. పులుపైన రుచిని కలిగి ఉంటుంది. డ్రై మసాలాలతో తయారుచేయడం వల్ల మరింత రుచి, వాసన ఉంటుంది. ఈ టమోటో రైస్ రిసిపిని ఇంట్లో తయారుచేయడం చాలా సులభం. ఈ రైస్ లంచ్ బాక్స్ లకు కూడా బాగుంటుందిజ

టమోటో రైస్ సౌత్ ఇండియన్ స్పెషల్ రైస్. సహజంగా ఈ రైస్ ను పండగల సమయాల్లో కూడా సింపుల్ గా , సులభంగా అవుతుందని చేసేస్తుంటారు. టమోటో రైస్ కు కాంబినేషన్ గా పపాడ్స్, రైతా వంటివి సైడ్ డిష్ గా తయారుచేసుకుంటారు.

టమోటో రైస్ సింపుల్ గా రుచికరమైనది మాత్రమే కాదు, ఒక సారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనే కోరికను మీలో కలిగిస్తుంది. మీరు కూడా ఈ రుచికరమైన రైస్ రిసిపిని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసి ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. అలాగే స్టెప్ బై స్టెప్ తయారీ విధానం కూడా ఫోటోలతో సహా ఫాలో అవ్వొచ్చు.

టమోటో రైస్ రెసిపీ | దక్షిణ భారత టమోటా భాత్ ఎలా తయారుచేయాలి | టమోటా భాత్ రెసిపీ | తెలంగాణ టమోటా రైస్ రెసిపీ
టమోటో రైస్ రెసిపీ | సౌత్ ఇండియన్ టమోటా భాత్ రిసిపి ఎలా తయారుచేయాలి | టమోటా భాత్ రెసిపీ | తెలంగాణ టమోటా రైస్ రెసిపీ
Prep Time
10 Mins
Cook Time
30M
Total Time
40 Mins

Recipe By: అర్చన వి

Recipe Type: ప్రధాన కోర్సు

Serves: 2

Ingredients
  • అల్లం (తొక్క తీసి అర అంగుళంలో ముక్కలుగా కట్ చేసినవి) - 2

    వెల్లుల్లి - 4 రెబ్బలు

    జీడిపప్పు - 3

    ఏలకులు - 2

    దాల్చిన చెక్క (1/2 అంగుళం ముక్కలు) - 2

    లవంగాలు - 6

    టమోటా (సగానికి కట్ చేసినవి) - 2

    టమోటో (సగానికి కట్ చేసినవి) - 1

    నూనె - 3 టేబుల్ స్పూన్లు

    స్టార్ సొంపు - 2 రేకులు

    కల్పాసి మసాలా దినుసు (నల్ల రాయి పువ్వు) - 1 స్పూన్

    ఉల్లిపాయ (సన్నని మరియు పొడవైన ముక్క, ముక్కలుగా చేసివి) - 1 కప్పు

    పచ్చిమిర్చి (మద్యకు కట్ చేసిని) - 2

    పుదీనాఆకులు (సన్నగా తరిగినది) - 1/4 కప్పు

    ఉప్పు: రుచికి సరిపడా

    సాంబార్ పౌడర్ - 1 స్పూన్

    రైస్ - 1/2 గిన్నె

    నీరు - 1 గిన్నె

How to Prepare
  • 1. కుక్కర్లో బియ్యాన్ని తీసుకోండి.

    2. సరిపడా నీరు మరియు ఉప్పు 2 టీస్పూన్లు వేయాలి.

    3. తర్వాత మూత పెట్టి, 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

    4. మిక్సిర్ జార్ అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి.

    5. తర్వాత జీడిపప్పును వేయాలి.

    6. అలాగే ఏలకులు మరియు దాల్చిన చెక్క కూడా వేయాలి.

    7. ఇంకా అదే జార్ లో 4 లవంగాలు మరియు 2 టమోటాలు(కట్ చేసినవి)వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

    8. మొత్తం మిశ్రమం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

    9. వేడిచేసిన పాన్లో నూనె వేయండి.

    10. తర్వాత 2 లవంగాలు మరియు దాల్చిన చెక్కను వేయాలి.

    11. స్టార్ సొంపు మరియు కల్పాసి మసాలా దినుసును కూడా వేయాలి.

    12. ఏలకులు మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి.

    13. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి,పుదీనా ఆకులు కూడా వేసి వేగించాలి

    14. తర్వాత టమోటో ముక్కుల కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ వేగించుకోవాలి.

    15. ఇప్పుడు ఉప్పు వేసి మరో 2 నిముషాలు వేయించాలి.

    16. ఇప్పుడు పాన్ లో ముందుగా మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి.

    17. మొత్తం మిశ్రమాన్ని 5 నిముషాలు వేగించాలి, పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.

    18. అందులోనే కొంచెం సాంబార్ పొడిని కలిపి, 2 నిమిషాలు ఉడికించాలి.

    19. తర్వాత వండిన అన్నం వేసి బాగా కలపాలి.

    20. అంతే టమోటో రైస్ రెడీ మరో గిన్నెలోకి మార్చుకుని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Instructions
  • 1. బియ్యం వాడటానికి ముందు నీళ్ళలో బాగా కడిగి ుంచుకోవాలి. అలాగే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు సరిపడా పోసుకోవాలి. 2. బియ్యం ఉడికేటప్పుడు ఉప్పు వేయడం వల్ల అన్నంకు ఉప్పు బాగా పడుతుంది. అన్నం రుచికరంగా ఉంటుంది. 3. స్టార్ సోంపు జోడించడం వల్ల టేస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 4. సాంబార్ పౌడర్ సరిపడా జోడించాలి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 cup
  • కేలరీలు - 258 cal
  • కొవ్వు - 2 g
  • ప్రోటీన్ - 7 g
  • కార్బోహైడ్రేట్లు - 53 g
  • షుగర్ - 5 g
  • ఫైబర్ - 8 g

స్టెప్ బై స్టెప్ - టామోటా రైస్ ఎలా తయారు చేయాలి

1. కుక్కర్లో బియ్యాన్ని తీసుకోండి.

2. సరిపడా నీరు మరియు ఉప్పు 2 టీస్పూన్లు వేయాలి.

3. తర్వాత మూత పెట్టి, 2 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.

4. మిక్సిర్ జార్ అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి.

5. తర్వాత జీడిపప్పును వేయాలి.

6. అలాగే ఏలకులు మరియు దాల్చిన చెక్క కూడా వేయాలి.

7. ఇంకా అదే జార్ లో 4 లవంగాలు మరియు 2 టమోటాలు(కట్ చేసినవి)వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

8. మొత్తం మిశ్రమం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

9. వేడిచేసిన పాన్లో నూనె వేయండి.

10. తర్వాత 2 లవంగాలు మరియు దాల్చిన చెక్కను వేయాలి.

11. స్టార్ సొంపు మరియు కల్పాసి మసాలా దినుసును కూడా వేయాలి.

12. ఏలకులు మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి.

13. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి,పుదీనా ఆకులు కూడా వేసి వేగించాలి.

14. తర్వాత టమోటో ముక్కుల కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ వేగించుకోవాలి.

15. ఇప్పుడు ఉప్పు వేసి మరో 2 నిముషాలు వేయించాలి.

16. ఇప్పుడు పాన్ లో ముందుగా మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి.

17. మొత్తం మిశ్రమాన్ని 5 నిముషాలు వేగించాలి, పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.

18. అందులోనే కొంచెం సాంబార్ పొడిని కలిపి, 2 నిమిషాలు ఉడికించాలి.

19. తర్వాత వండిన అన్నం వేసి బాగా కలపాలి.

20. అంతే టమోటో రైస్ రెడీ మరో గిన్నెలోకి మార్చుకుని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

[ 4 of 5 - 62 Users]
English summary

టమోటో రైస్ రిసిపి

Tomato rice is a traditional South Indian recipe that is prepared in most households. Watch the video recipe. Here is also the step-by-step procedure conta
Desktop Bottom Promotion