Latest Updates
-
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
మకర రాశిలో చంద్రుడి సంచారం: ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం, ధన లాభం ఖాయం! -
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి? -
జూన్ 30 చంద్ర సంచారం: మకర రాశిలో చంద్రుడి రాకతో ఈ రాశుల వారికి కెరీర్ లో తిరుగులేదు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి కుజ గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - మంగళవారం, 30 జూన్ 2026 -
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.! -
ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.! -
పోషకాల గని..డిన్నర్ లోకి హెల్తీ బ్రోకలీ చీజ్ పరాఠా..ఒక్క ముక్క కూడా మిగల్చరు!
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే
ముందురోజు పిండి రుబ్బి చేసే రెగ్యులర్ ఇడ్లీలు, అప్పటికప్పుడు చేసుకునే ఇన్ స్టంట్ ఇడ్లీలు, ఆరోగ్యానికి మేలు చేసే మిల్లెట్ ఇడ్లీలు.. ఇలా ఎన్నో రకాలు మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా తట్టే ఇడ్లీ గురించి విన్నారా? దీని రుచి, ఆకారం, చేసే విధానం అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. తట్టే ఇడ్లీ అనేది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక సాంప్రదాయ, స్పెషల్ వంటకం. మన ఇళ్లలో చేసుకునే సాధారణ ఇడ్లీలు గుండ్రంగా, ఉబ్బెత్తుగా ఉంటే.. ఈ తట్టే ఇడ్లీలు మాత్రం కాస్త పలుచగా, వెడల్పుగా ఉంటాయి. అందుకే వీటిని తయారు చేయడానికి ఇడ్లీ పాత్రలు కాకుండా కాస్త వెడల్పుగా ఉండే ప్రత్యేకమైన ప్లేట్లను ఉపయోగిస్తారు.

తట్టే ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
రేషన్ బియ్యం (దొడ్డు బియ్యం) - 3 కప్పులు
మినప పప్పు - 1 కప్పు
మెంతులు - 1 టీస్పూన్
అటుకులు - అర కప్పు
సగ్గు బియ్యం - పావు కప్పు
వంట సోడా - 2 చిటికెలు
ఉప్పు - రుచికి తగినంత
తట్టే ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని, అందులో రేషన్ బియ్యం, మినప పప్పు, మెంతులు వేసి శుభ్రంగా రెండుసార్లు కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-మరో గిన్నెలో అటుకులు, సగ్గుబియ్యం తీసుకుని, వాటిని కూడా కడిగి మంచి నీళ్లు పోసి కనీసం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత రెండింటినీ కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బుకున్న ఈ పిండిని 8 నుంచి 9 గంటల పాటు పులియబెట్టాలి. రాత్రంతా పిండిని బయట ఉంచితే ఉదయానికి చక్కగా పులిసిపోతుంది.
-ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, మిగిలిన పిండిని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా, కాస్త పలుచగానే ఉండేలా చూసుకోవాలి.
-తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. హోటల్ స్టైల్ లో ఇడ్లీలు స్పాంజీలా రావాలంటే అందులో 2 చిటికెల వంటసోడా వేయాలి.
-ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర లేదా పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని, అడుగున ఆవిరికి సరిపడా నీళ్లు పోయాలి. లోపల ఒక జల్లి గిన్నె లాంటిది పెట్టాలి.
-ఇప్పుడు చిన్న సైజులో ఉండే నాలుగు వెడల్పాటి ప్లేట్లను తీసుకుని, వాటికి కొద్దిగా నూనె రాయాలి. అందులో తట్టే ఇడ్లీ పిండిని పోసి, ఆ జల్లి గిన్నె పైన ఉంచి మూతపెట్టాలి. కన్నడలో ఈ ప్లేట్లను తట్టే అని పిలుస్తారు, అందుకే వీటికి తట్టే ఇడ్లీ అని పేరు. ప్లేట్లను తీయడానికి ఇబ్బంది లేకుండా, వాటి కింద చిన్న గిన్నెలను బోర్లించి స్టాండ్ లా పెట్టి ఉడికిస్తారు.
-సుమారు 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే.. ఎంతో రుచికరమైన తట్టే ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications