Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రక్తం పట్టడానికి,ఎముకల బలానికి..పాతకాలం నాటి సజ్జప్పాలు..ఈ పద్ధతిలో చేస్తే అదుర్స్
సజ్జప్పాలు అనేవి సాంప్రదాయకమైన, ఆరోగ్యకరమైన రుచికరమైన తెలుగు వంటకం. ఇవి పండుగల సమయాల్లో ఎక్కువగా తయారు చేస్తారు. సజ్జలు తృణధాన్యాలలో ఒకటైనందున, వీటితో చేసే సజ్జప్పాలు పోషక విలువలతో నిండి ఉంటాయి. రక్తహీనత పోగొట్టి,ఎముకల బలాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పెరుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది,బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సజ్జపాలు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సజ్జప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం
-సజ్జలు
-యాలకల పొడి
-నెయ్యి
-గసగసాలు
-పచ్చి కొబ్బరి తురుము
-ఉప్పు
-ఆయిల్

సజ్జప్పాలు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సజ్జలు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత మళ్లీ ఒకసారి కడిగి జల్లెడ పట్టి నీళ్లు అన్నీ తీసేయాలి. ఇప్పుడు వీటిని పొడిబట్ట మీద వేసి కొంచెం తడి పోయేలా అరగంట పాటు ఎండలో కాకుండా గాలిలోనే ఆరబెట్టుకోవాలి.
-ఆరిన సజ్జలను మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జల్లెడలో వేసి జల్లించుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక 2 స్పూన్ల గసగసాలు అందులో వేసి ఒకసారి కలిపాక ఇందులోనే పావు కప్పు ప్రెష్ పచ్చి కొబ్బరి తురుము వేసి 2-3 నిమిషాలు వేయించి దించేయాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో అరకప్పు బెల్లం,చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నీళ్లు వేసి బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆపేయండి. పాకం రానక్కర్లేదు.
-ఇప్పుడు జల్లించి పెట్టుకున్న సజ్జ పిండిలో పావు యాలకల పొడి, వేయించి పెట్టుకున్న గసాలు కొబ్బరి తురుము వేసి మొత్తం బాగా కలిపాక బెల్లం నీళ్లను కొంచెం కొంచెంగా వడకట్టుకుంటూ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు.
-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకుంటూ అరిటాకు లేదా పాల ప్యాకెట్ కవర్ మీదగానీ పెట్టి అప్పాల్లా వత్తుకోవాలి. మరీ మందంగా లేదా మరీ పల్చగా వత్తుకోకూడదు.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక మంటను మీడియంలో ఉంచి ఆయిల్ లో వత్తుకున్న అప్పాలు వేసి పొంగిన వెంటనే రెండో వైపు తిరగేసి కొద్దిగా రంగు మారి నురగలు రావడం తగ్గగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే సజ్జప్పాలు రెడీ. అదనపు నూనె పోయేందుకు ఒక టిష్యూ పేపర్ పై ఉంచాలి.
-చల్లారిన తర్వాత, సజ్జప్పాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇవి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
-సజ్జప్పాలు వేయించిన ఆహారం కాబట్టి ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనం
పొందడానికి మితంగా తీసుకోవడం ముఖ్యం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications