ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా

Posted By:

వీకెండ్ లో స్పైసీ నాన్ వెజ్ తినాలనిపిస్తే ఒక్కసారి ఆదివాసీ స్టైల్ చేపల వేపుడు ట్రై చేసి చూడండి. ట్రైబల్ ఫిష్ ఫ్రై రెసిపి ఒక్కసారి ట్రై చేశారంటే ఇక చేప అంటే మీకు ఇదే గుర్తుకొస్తుంది. ఇలాంటి ఫిష్ ఫ్రై టేస్ట్ మీరు మరెక్కడా చూడలేరు. ఇలాంటి చేపల వేపుడు నెవ్వర్ బిఫోర్,ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు ఫీల్ అవుతారు. ఆదివాసీలు కేవలం తమకు దొరికిన పదార్థాలతోనే చేసుకునే చేపల ఫ్రై ఇది. ఆదివాసీ చేపల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఆదివాసీ చేపల వేపుడు తయారీకి కావాల్సినవి

-చేపలు
-ఎండు ఉసిరికాయ ముక్కలు
-మెంతులు
-మిరియాలు లేదా పచ్చిమిర్చి
-ఉప్పు
-కొబ్బరి నూనె
-కరివేపాకు
-వెల్లుల్లి రెబ్బలు

tribal style fish fry recipe in telugu best aadivasi chepala vepudu for sunday special

ఆదివాసీ చేపల వేపుడు తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో 1/3 కప్పు ఎండు ఉసిరికాయ ముక్కలు వేసి ఇందులో నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు లేదా రాత్రంతా నానబెట్టుకోండి.

-మెత్తగా నానిన తర్వాత ఉసిరికాయ ముక్కలను నీళ్లతో సహా మిక్సీ జార్ లో వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, కొంచెం ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ మెంతులు వేయించాలి. నల్లబడిన మెంతులను ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడి చెయ్యండి. నూనె వేడెక్కాక అందులో 15 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి రంగు మారుతున్నప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న ఉసిరి పేస్ట్ వేసి ఒక నిమిషం వేపితే సరిపోతుంది.

-తర్వాత అందులోనే వేయించుకున్న మెంతులను దంచుకొని ఆ పొడిని పాన్ లోని మిశ్రమంలోని వేసి కలుపుకోండి. ఇందులోనే 1/3 కప్పు నీళ్లు పోసి బాగా కలిపి దగ్గరగా ఉడకనివ్వాలి.

-ఉడుకుపట్టి దగ్గరగా అయిన తర్వాత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆపేయండి.

అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ

-ఇప్పుడు 750 గ్రాముల శుభ్రంగా కడిగిన చేప ముక్కలను ఆ పాన్ లో నీటుగా సర్దినట్లుగా వేసి, ఇందులోనే కరివేపాకు వేసి అరగంట సేపు అలా వదిలేస్తే ఆ ప్లేవర్స్ అన్నీ చేప ముక్కల్లోకి దిగుతాయి. అసలైన ఆదివాసీల స్టైల్ లో అయితే జస్ట్ ఉసిరి పేస్ట్ పట్టించి ఫ్రై చేస్తారు. అయితే కొంచెం మార్పులు చేర్పులు చేస్తే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.

-అరగంట తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి దానిమీద 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడయ్యాక దానిమీద 30 నిమిషాల పాటు ఊరిన చేప ముక్కలను నెమ్మదిగా తీసి వేయండి. మీడియం మంట మీద నిదానంగా కాల్చుకోండి. చేప ముక్కలను సర్దిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు కాలనివ్వండి. తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు అడుగున మంచిగా కాలుతుంది అప్పుడు దానిని రెండో వైపుకి తిప్పి పైన కొంచెం ఆయిల్, కరివేపాకు వేసి మూతపెట్టకుండా కాల్చుకోండి.

-రెండువైపులా ఎర్రగా కాల్చుకుని స్టవ్ ఆపేయండి. అంతే ట్రైబల్ ఫిష్ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 24, 2026, 20:22 [IST]
Desktop Bottom Promotion