రొటీన్‌ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్‌.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.!

సాధారణంగా టిఫిన్స్‌ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరీ, చపాతీ ఇలా సాంప్రదాయ వంటకాలే గుర్తుకొస్తాయి. కానీ ఎప్పుడైనా సొరకాయతో టిఫిన్‌ ట్రై చేశారు. అప్పుడప్పుడూ సొరకాయతో హల్వా లేదంటే ఏదైనా కొత్త రకం స్నాక్స్‌ చేసి ఉంటారు. కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికి అందించేలా ఈసారి తక్కువ నూనెతో ఇలా డిఫరెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ చేయండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు స్టార్టర్‌గానూ, స్నాక్స్‌గానూ ఇష్టంగా తినవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా సొరకాయతో గుజరాతి స్టైల్‌ దూది నా ముటియా ఎలా చేయాలో చూద్దాం..

Try these breakfast with bottle gourd instead of routine tiffins gujarati style dudi na mutiya

గుజరాతి స్టైల్‌ దూది నా ముటియా తయారీకి కావాల్సిన పదార్థాలు

వెల్లుల్లి- 12
పచ్చిమిర్చి- 5
అల్లం ముక్క- చిన్నది
నీరు పిండిన సొరకాయ- తురుము- రెండు కప్పులు
పంచదార- టేబుల్‌ స్పూన్‌
వంట సోడా- పావు టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర- కప్పు
నిమ్మకాయ- మీడియం సైజు
పసుపు- పావు టీస్పూన్‌
గరం మసాలా- పావు టీస్పూన్‌
గోధుమ పిండి- కప్పు
బొంబాయి రవ్వ- టేబుల్‌ స్పూన్‌
శనగపిండి- టేబుల్‌ స్పూన్‌
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు

తాలింపు కోసం

పల్లీ నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
ఆవాలు- టీ స్పూన్‌
జీలకర్ర- అర టీస్పూన్‌
నువ్వులు- అర టేబుల్‌ స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు
ఇంగువ- కొద్దిగా

గుజరాతి స్టైల్‌ దూది నా ముటియా తయారీ విధానం

ముందుగా సొరకాయను తొక్క తీసి తురుముకోవాలి. ఈ తురుమును శుభ్రమైన పొడిగుడ్డలో వేసి నీరు మొత్తం పోయేలా పిండుకోవాలి. ఈ తురుమును ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇది రెండు కప్పులు ఉంటే సరిపోతుంది.

ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా రుబ్బుకోవాలి.

ఈ పేస్ట్‌ను సొరకాయ తురుములో వేసి ఒత్తిడి పెట్టకుండా కలుపుకోవాలి. తర్వాత పంచదార, వంటసోడా, ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయ రసం, పసుపు, గరం మసాలా వేసి వేళ్లతో కలుపుకోవాలి.

Try these breakfast with bottle gourd instead of routine tiffins gujarati style dudi na mutiya

ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కప్పులో సగం గోధుమ పిండిని మృదువుగా కలిపిన తర్వాత మిగిలిన పిండిని మరోసారి వేసి సాఫ్ట్‌గా కలుపుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ, శనగపిండి, నూనె వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టీమర్‌ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. స్టీమర్‌ ప్లేట్‌పై కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. నీళ్లు మరిగే లోపు చేతులకు కొద్దిగా నూనె రాసి సొరకాయ పిండి ముద్దను తీసుకుని సిలిండర్‌ ఆకృతి మాదిరిగా చేసుకోవాలి.

ఇలా అన్నిటిని చేసుకుని స్టీమర్‌ ప్లేట్‌పై విడివిడిగా పెట్టుకోవాలి. దీనిని స్టీమర్‌ గిన్నెలో పెట్టుకుని 15 నుంచి 17 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఆవిరి పైన ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మంచిగా ఉడికాయా లేదా చెక్‌ చేసుకోవాలి.

ప్లేట్‌ను తీసుకుని పక్కన పెట్టుకొని వాటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని చక్రాలు మాదిరిగా అన్నిటినీ ఒకే షేప్‌లో కోసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో పల్లీ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కలుపుకోవాలి. వేగిన తర్వాత ప్రిపేర్‌ చేసిన ముటియా ముక్కలను వేసి చిరిగిపోకుండా మృదువుగా పైకి కిందికీ కలుపుకోవాలి. ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి వేడివేడిగా వడ్డించుకోవడమే.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 28, 2026, 12:55 [IST]
Desktop Bottom Promotion