Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మిగిలిపోయిన ఇడ్లీతో చాట్..బయట క్రంచీగా,లోపల సాఫ్ట్ గా,తినేందుకు సూపర్ గా
మన తెలుగు వారి ఇళ్లల్లో పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి తరచుగా ఇడ్లీని చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా ఉదయం చేసిన ఇడ్లీ మిగిలిపోతే వాటిని పడేయకుండా సాయంత్రం పూట ఇడ్లీ చాట్ రూపంలో స్నాక్ గా చేసేయొచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికైనా నచ్చేసే టేస్ట్ తో ఉంటుంది.
ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇది చేసినా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేరు. దీనిని చేయడం కూడా చాలా సింపుల్. మిగిలిన ఇడ్లీతో చాట్ ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఇడ్లీలు
-మైదా పిండి
-ఆయిల్
-పెరుగు
-ఉప్పు
-బ్లాక్ సాల్ట్
-పల్లీలు
-జీలకర్ర పొడి
-విత్తనాలు లేని టమాటో(బెంగళూరు టమాటో)
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-నిమ్మరసం
-చాట్ మసాలా
-జీలకర్ర పొడి
-టమాటో కెచప్
-పుదీనా చట్నీ
-అల్లం తరుగు
-దానిమ్మ గింజలు
-చక్కెర
తయారీ విధానం
-పూర్తిగా చల్లారిపోయి ఉన్న 8 ఇడ్లీలను క్యూబ్స్ గా కట్ చేసుకోండి.
-కట్ చేసిన ఇడ్లీ క్యూబ్స్ అన్నీ ఒక గిన్నెలో వేసి ఇడ్లీ క్యూబ్స్ మీద 1 స్పూన్ మైదా పిండి చల్లి పల్చగా కలుపుకోండి. మైదా పిండి ఎక్కువ వేయవద్దు.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి బాగా మరిగాక మంటను మీడియంలో పెట్టి ఇందులో మైదాపిండితో కలుపుకున్న ఇడ్లీ ముక్కలను ఒక్కొక్కటిగా బాండీలో వేసి లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయిస్తే సరిపోతుంది. మరీ ఎర్రగా అయ్యేదాకా వేపకూడదని గుర్తుంచుకోండి.
-వేయించిన ఇడ్లీ క్యూబ్స్ ని ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోని ఆయిల్ లో పావు కప్పు వేరుశెనగపప్పు వేసి మీడియం మంట మీద పప్పు చిట్లేంత వరకు వేయించి బయటకు తీసుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు చల్లటి పెరుగు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేపి బాగా చిలకండి. దీంతో అది తరకలు లేకుండా క్రీమ్ లా మారుతుంది.
-ఇప్పుడు చాట్ రెడీ చేయడం కోసం.. వేయించిన ఇడ్లీ ముక్కలు ఉన్న ప్లేట్ లో ఇడ్లీ మీద కలిపిన పెరుగును స్పూన్ తో పరిచినట్లు చేయండి. పెరుగు మీద వేయించిన పల్లీలు, గింజలు తీసేసిస సన్నని టమాటో తరుగు, కొంచెం జీలకర్ర పొడి,కొంచెం ఎండు కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం పచ్చిమిర్చి సన్నని తరుగు, కొత్తిమీర సన్నని తరుగు, 1 టీస్పూన్ టమాటో కెచప్, కొంచెం పుదీనా చట్నీ, కొద్దిగా అల్లం తరుగు, కొంచెం నిమ్మరసం, దానిమ్మ గింజలు కొన్ని చల్లుకోండి.
-అంతే టేస్టీ ఇడ్లీ చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










