Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిగిలిన అన్నంతో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్..కేవలం ఉల్లిపాయలు ఉంటే చాలు
ఉదయం లేవగానే ఇంట్లో అమ్మలకు, ఉద్యోగస్తులకు ఎదురయ్యే మొదటి ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం చేయాలి?. అందులోనూ ఫ్రిజ్ లో కూరగాయలు నిండుకున్న రోజున అయితే ఏం వండాలో తెలియదు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? మీ వంటింట్లో కేవలం ఉల్లిపాయలు, అన్నం ఉంటే చాలు.. చిటికెలో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. అదే ఆనియన్ రైస్ లేదా ఉల్లిపాయ అన్నం.
ఈ వంటకం ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని తయారు చేయడానికి మీకు పెద్దగా సమయం పట్టదు. కేవలం 5-10 నిమిషాల్లోనే ఘమఘమలాడే టిఫిన్ మీ ముందు ఉంటుంది. వంట రాని వారు, బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకోగలిగే రుచికరమైన వంటకం ఇది. నోరూరించే ఈ ఉల్లిపాయ అన్నం ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వండిన అన్నం - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 2
జీడిపప్పు - గుప్పెడు
కారం పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా అన్నం వండుకుని చల్లార్చుకోండి లేదా రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాన్ని పొడిపొడిగా చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నం అన్నం పలుకుగా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి లేదా పాన్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడుతుండగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పాన్ లో వేయండి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి, మంచి బంగారు రంగు వచ్చేంత వరకు సన్నని మంటపై వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే, రైస్ అంత రుచిగా ఉంటుంది.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని ఈ మిశ్రమంలో వేయండి. మసాలా అంతా అన్నానికి పట్టేలా మెల్లగా కలపండి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కింది నుండి పైకి కలపాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడి వేడి, రుచికరమైన ఆనియన్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications