Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చింతపండు, నిమ్మకాయ పులిహోర కాదు..మిగిలిపోయిన అన్నంతో కమ్మని కొబ్బరి పులిహోర
తెలుగు వారి వంటగదిలో పులిహోరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా చింతపండు పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర ఎక్కువగా చేసుకుంటారు. కానీ, ఎంతో రుచిగా, కమ్మగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే మరొక అద్భుతమైన రకం కొబ్బరి పులిహోర. పోషకాల గని అయిన కొబ్బరి పులిహోరని బ్రేక్ ఫాస్ట్ గా లేదా లంచ్ గా తీసుకోవచ్చు.
పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకం, మన శరీరానికి అవసరమైన శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. మిగిలిన అన్నంతో కొబ్బరి పులిహోర చేసుకోవచ్చు. కొబ్బరి పులిహోరను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి కొబ్బరి
-కొత్తిమీర
-కరివేపాకు
-పల్లీలు
-జీలకర్ర
-ఆవాలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఉప్పు
-ఉడికించిన అన్నం
-పచ్చి శెనగపప్పు
-మినపగుళ్లు
-జీడిపప్పు
-నూనె
తయారీ విధానం
-ముందుగా ఒక గ్లాసు బియ్యం(250గ్రా)శుభ్రంగా రెండుసార్లు కడగాలి.
-ఇప్పుడు కుక్కర్ లో కడిగిన బియ్యం వేసి ఇందులో రెండు గ్లాసుల నీళ్లు, 1 టీస్పూన్ నూనె వేసి కుక్కర్ మూతపెట్టి స్టవ్ మీద పెట్టేయాలి. మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, పచ్చి కొబ్బరి ముక్కలు(ఒక పెద్ద కాయలో సగం చిప్ప), 6 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పల్లీలు గుప్పెడు వేసి వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్లు, చివర్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి.
-వేగిన అన్నింటినీ నూనె లేకుండా ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో ఉన్న నూనెలోనే అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయల ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముక్కల పేస్ట్ ను వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి. ఆయిల్ లైట్ గా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి అందులో కొంచెం నిమ్మరసం,కొత్తమీర తరుగు వేసి కలుపుకోండి.
-ఇప్పుడు అందులో ఉడికించిన అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు మిశ్రమం కూడా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. అంతే కొబ్బరి పులిహోర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications