Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకుండా ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, లొట్టలేస్తారు!
పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి? అనే ప్రశ్న చాలామంది గృహిణులను వేధిస్తుంటుంది. ఇడ్లీ, దోసలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా ఏదైనా కొత్తగా, కారంగా తినాలనిపించినప్పుడు అందరికీ గుర్తొచ్చేది రైస్ ఐటమ్స్. పులిహోర, చిత్రాన్నం, టమాటా బాత్, వెజ్ పలావ్, ఎగ్ రైస్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. ఇవన్నీ రుచికి అద్భుతంగా ఉన్నప్పటికీ, వీటిని తయారు చేయడానికి కాస్త సమయం పడుతుంది.
కానీ తక్కువ సమయంలో ఇంట్లో ఉండే వాటితోనే వెల్లుల్లి రైస్ చేసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే ఘాటు, నెయ్యి సువాసన, మిరియాల కారం వెరసి ఈ వంటకాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దవారి వరకు లొట్టలేసుకుంటూ తినే ఈ వెల్లుల్లి రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు: 10-15
ఉల్లిపాయ: 1
నెయ్యి: 2 స్పూన్లు
నూనె: 1 స్పూన్
మిరియాల పొడి: అర టీస్పూన్
తాలింపుకి: ఆవాలు, మినపప్పు, శనగపప్పు
ఎండు మిరపకాయలు: 2
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు:సరిపడా
తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని ఉడికించుకుని ఒక ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉంటే ఈ వంటకం మరింత రుచిగా ఉంటుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని, అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులు వేగగానే ఎండు మిరపకాయలు, కరివేపాకు వేస్తే ఆ సువాసన అద్భుతంగా ఉంటుంది.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కడాయిలో వేసి అవి లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద మరో చిన్న పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక, పొట్టు తీసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి చిన్న మంటపై వేయించాలి. వెల్లుల్లి మాడిపోకుండా, బంగారు రంగులోకి వచ్చి కమ్మని వాసన వచ్చే వరకు 4-5 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని, ఉల్లిపాయలు వేయించిన కడాయిలో వేయాలి. ఆ వెంటనే నెయ్యిలో వేయించిన వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా అన్నంపై వేయాలి. చివరిగా మిరియాల పొడిని, సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లాలి.
-ఇప్పుడు అన్ని పదార్థాలు అన్నానికి పట్టేలా బాగా కలపాలి. అవసరమైతే ఒక్క నిమిషం పాటు సన్నని మంటపై ఉంచి వేడి చేయవచ్చు. అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన వెల్లుల్లి రైస్ రెడీ.
-ఇది లంచ్ బాక్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ రైస్ తింటే నోటికి రుచిగా ఉండటమే కాకుండా గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications