Latest Updates
-
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.!
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా..
రక్తహీనతను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని, చర్మానికి సహజమైన నిగారింపును అందించే అద్భుతమైన పోషకాల గని బీట్ రూట్. అయితే బీట్ రూట్ తో కేవలం సలాడ్స్, జ్యూస్ లే కాకుండా నోరూరించే అద్భుతమైన స్వీట్ కూడా తయారు చేయవచ్చు..అదే బీట్ రూట్ హల్వా. ఎప్పుడూ చేసుకునే బొంబాయి రవ్వ కేసరి, క్యారెట్ హల్వా కాకుండా, ఈసారి కాస్త భిన్నంగా, ఆరోగ్యకరంగా ఈ హల్వాను ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బీట్ రూట్ హల్వాను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బీట్ రూట్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద బీట్ రూట్ - 2
చిక్కటి పాలు - 1 లీటరు
చక్కెర - అర కప్పు
నెయ్యి - పావు కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
కుంకుమపువ్వు - చిటికెడు
బాదం, పిస్తా పప్పు- అర కప్పు
బీట్ రూట్ హల్వా తయారీ విధానం
-ముందుగా బీట్ రూట్ లను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటి పైన ఉండే తొక్కను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో తగినన్ని నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, ముక్కలను చల్లారనివ్వాలి. చల్లారిన ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా లేదా గుజ్జులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి లోతైన కడాయిని పెట్టుకోవాలి. అందులో ఒక లీటరు పాలు పోసి, అర కప్పు చక్కెర వేసి మీడియం మంట మీద మరిగించాలి. పాలు కాస్త మరిగి, చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బీట్ రూట్ పేస్ట్ ను అందులో వేసి గరిటెతో బాగా కలపాలి. పాలు, బీట్ రూట్ మిశ్రమం ఒకదానికొకటి బాగా కలిసిపోయేలా చూసుకోవాలి.
-ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు అందులో పావు కప్పు నెయ్యి, కమ్మని సువాసన కోసం యాలకుల పొడి వేయాలి. హల్వా అడుగు మాడిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.
-పాలన్నీ ఇగిరిపోయి, మిశ్రమం దగ్గరపడి హల్వాలాగా చిక్కబడే వరకు సన్నని మంట మీద ఉడికించాలి. హల్వా సరైన కన్సిస్టెన్సీకి రాగానే, అందులో ఒక చిటికెడు కుంకుమపువ్వు, సన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులను వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన బీట్ రూట్ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications