Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా..
రక్తహీనతను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని, చర్మానికి సహజమైన నిగారింపును అందించే అద్భుతమైన పోషకాల గని బీట్ రూట్. అయితే బీట్ రూట్ తో కేవలం సలాడ్స్, జ్యూస్ లే కాకుండా నోరూరించే అద్భుతమైన స్వీట్ కూడా తయారు చేయవచ్చు..అదే బీట్ రూట్ హల్వా. ఎప్పుడూ చేసుకునే బొంబాయి రవ్వ కేసరి, క్యారెట్ హల్వా కాకుండా, ఈసారి కాస్త భిన్నంగా, ఆరోగ్యకరంగా ఈ హల్వాను ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బీట్ రూట్ హల్వాను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బీట్ రూట్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద బీట్ రూట్ - 2
చిక్కటి పాలు - 1 లీటరు
చక్కెర - అర కప్పు
నెయ్యి - పావు కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
కుంకుమపువ్వు - చిటికెడు
బాదం, పిస్తా పప్పు- అర కప్పు
బీట్ రూట్ హల్వా తయారీ విధానం
-ముందుగా బీట్ రూట్ లను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటి పైన ఉండే తొక్కను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో తగినన్ని నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, ముక్కలను చల్లారనివ్వాలి. చల్లారిన ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా లేదా గుజ్జులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి లోతైన కడాయిని పెట్టుకోవాలి. అందులో ఒక లీటరు పాలు పోసి, అర కప్పు చక్కెర వేసి మీడియం మంట మీద మరిగించాలి. పాలు కాస్త మరిగి, చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బీట్ రూట్ పేస్ట్ ను అందులో వేసి గరిటెతో బాగా కలపాలి. పాలు, బీట్ రూట్ మిశ్రమం ఒకదానికొకటి బాగా కలిసిపోయేలా చూసుకోవాలి.
-ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు అందులో పావు కప్పు నెయ్యి, కమ్మని సువాసన కోసం యాలకుల పొడి వేయాలి. హల్వా అడుగు మాడిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.
-పాలన్నీ ఇగిరిపోయి, మిశ్రమం దగ్గరపడి హల్వాలాగా చిక్కబడే వరకు సన్నని మంట మీద ఉడికించాలి. హల్వా సరైన కన్సిస్టెన్సీకి రాగానే, అందులో ఒక చిటికెడు కుంకుమపువ్వు, సన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులను వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన బీట్ రూట్ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
