Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చరిత్ర సృష్టించే రుచి: చిట్టిముత్యాలతో బెస్ట్ మటన్ ధమ్ బిర్యానీ..ఈ స్టైల్ లో చేస్తే వీధిలోకి ఘుమఘుమలు
బిర్యానీ ప్రియులకు, రుచిని ఆస్వాదించే వారికి చిట్టిముత్యాల బియ్యంతో చేసే వంటకాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. సువాసన, రుచిలో సాటిలేని ఈ చిన్న బియ్యం మటన్ దమ్ బిర్యానీతో కలిస్తే ఆ ఘుమఘుమలు, రుచి మాటల్లో వర్ణించలేనిది. చిట్టిముత్యాల బియ్యం దక్షిణాదిలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని బిర్యానీలకు ప్రసిద్ధి. వీటి పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, వీటి నుంచి వచ్చే అద్భుతమైన సువాసన బిర్యానీకి ఒక ప్రత్యేకమైన రుచిని, ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. చిట్టిముత్యాలతో బెస్ట్ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-టమాటో
-పెరుగు
-మటన్
-నెయ్యి
-ఆయిల్
-చిట్టిముత్యాల బియ్యం
-బిర్యానీ ఆకు
-లవంగాలు
-షాజీరా
-అనాసపువ్వు
-రాతిపువ్వు
-యాలకలు
-దాల్చిన చెక్క
-ధనియాల పొడి
-కారం
-ఉప్పు
-బిర్యానీ మసలా లేదా గరం మసాలా
-పచ్చిమిరపకాయలు
-బొగ్గులు లేదా కొబ్బరి పెంకులు
-కొత్తిమీర
-పుదీనా
-జీడిపప్పు

తయారీ విధానం
-స్టవ్ మీద అడుగుమందంగా ఉండే పెద్ద గిన్నె పెట్టి అందులో పావు కప్పు నెయ్యి, పావు కప్పు కంటే కొంచెం తక్కువ నూనె వేసి వేడి చేశాక ఇందులో 2 అనాస పువ్వులు, 3 అంగుళాల దాల్చిన చెక్క, 7 యాలకలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 10-12 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, రాతి పువ్వు వేసి వేయించాలి.
-మసాలాలు వేగుతున్న సమయంలోనే అందులో పావుకప్పు జీడిపప్పు వేసి వేయించాక 2 పెద్ద ఉల్లిపాయల చీలికలు వేసి అవి పింక్ కలర్ లోకి మారిన తర్వాత అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
-ఇప్పుడు కొవ్వుతో ఉన్న అరకేజీ మటన్ ముక్కలు వేసి పెద్ద మంట మీద కలుపుతూ మటన్ మీద కాలినట్లు ఎర్రని మచ్చలు వచ్చేదాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో 2 టమాటోల తరుగు, పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, ముప్పావు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసి 1 నిమిషం వేయించాక అందులో అరకప్పు పెరుగు వేసి కలుపుకోవాలి.
-పెరుగు మటన్ లో కలిసిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అందులో గంటసేపు నానబెట్టిన రెండున్నర కప్పుల చిట్టిముత్యాల బియ్యం(200గ్రా),3 పచ్చిమిరపకాయల చీలికలు వేసి 4 నిమిషాలు పెద్ద మంట మీద 3 నిమిషాలు పెద్ద మంట మీద కలుపుతూ వేయించాక 5 కప్పుల వేడి నీళ్లు పోసి ఒకసారి కలిపి గిన్నె మీద ప్లేట్ పెట్టి దానిని అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి దీనిమీద ఎర్రగా కాల్చిన బొగ్గుముక్కలు వేయండి.లేదా కొబ్బరి పెంకులు అయినా కాల్చి వేసుకోండి.
-బొగ్గుముక్కలు వేసి చేసుకున్నవాళ్లు అయితే 8 నిమిషాలు పెద్ద మంట మీద, 6 నిమిషాలు తక్కువమంట మీద ఉడికించి స్టవ్ ఆపేసి అరగంట సేపు వదిలేయాలి.
-బొగ్గుముక్కలు లేకుండా చేసుకునేవాళ్లు అయితే 12 నిమిషాలు పెద్ద మంట మీద 10 నిమిషాలు తక్కువ మంట మీద దమ్ చేసి స్టవ్ ఆపేసి అరగంట సేపు వదిలేయాలి. తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి 10 నిమిషాలు వదిలేయాలి. అంతే టేస్టీ మటన్ ధమ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications