Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అమృతం లాంటి వాము ఆకు చారు..వేడి అన్నంలోకి తింటే రుచి అదుర్స్..రోగాలు పరార్!
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కలలో వాము ఆకు ఒకటి. మన పెరటిలో లేదా కుండీలలో చాలా సులభంగా పెరిగే ఈ మొక్కకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన సువాసన, మందపాటి ఆకులు దీని ప్రత్యేకత. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు వాము ఆకు ఒక దివ్యౌషధం. ఈ ఆకుతో చేసే చారు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు అందించిన గొప్ప వంటకం ఈ వాము ఆకు చారు. వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు సూప్ లాగా గ్లాసులో పోసుకుని తాగవచ్చు. వారానికి ఒకసారైనా ఈ చారును ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. వాము ఆకు చారు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి
-వాము ఆకులు
-చింతపండు
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ఆయిల్
-జీలకర్ర
-మెంతులు
-ఆవాలు
-మిరియాలు
-ధనియాలు
-పసుపు
-ఉప్పు
-బెల్లం పొడి
వాము ఆకు చారు తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీటిలో నానబెట్టుకోండి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీ గిన్నెలో 1 టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాలు వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు గ్రైండ్ చేసిన పొడిలోనే 8 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే దంచుకోండి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేశాక అందులో 10 మెంతులు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించుకోవాలి.
-తాలింపు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించుకోండి.
-ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 20 వామాకులు సన్నగా తరిగి పాన్ లో వేసుకోండి.
-వామాకు కొంచెం మెత్తబడే వరకు వేయించుకున్నాక అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండులో నుంచి 3 కప్పుల నీళ్లు పోసి, అర టీస్పూన్ బెల్లం పొడి వేసి మీడియం మంట మీద 5 నిమిషాలు మరిగించాలి. అంతే వాము ఆకు చారు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications