Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే!
మండుతున్న ఎండలకు కడుపులో ఏదైనా చల్లగా, హాయిగా ఉంటే బాగుంటుందనిపిస్తుందా? మీ ఇంట్లో వాళ్లకు రసం అంటే ప్రాణమా? వేసవికాలం వచ్చిందంటే చాలు, చాలా ఇళ్లలో భోజనం రసంతోనే ముగుస్తుంది. అయితే రోజువారీ చేసే రసానికి కాస్త భిన్నంగా, ఈ ఎండల్లో శరీరానికి ఎంతో చలవ చేసే టమాటా రసం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది కేవలం కడుపుకే కాదు, మనసుకు కూడా ఎంతో హాయినిస్తుంది.

సాధారణంగా రసం చేయడం చాలా సులభం. కానీ, అప్పటికప్పుడు తాజా దినుసులతో రసం పొడిని ఇంట్లోనే దంచి, ఈ టమాటా రసం చేస్తే ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పళ్లెంలో అన్నం వడ్డించిన క్షణాల్లోనే ఖాళీ చేసేస్తారు. సమ్మర్ స్పెషల్ టమాటా రసం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
టమాటా రసం తయారీకి కావలసిన పదార్థాలు
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - 15 గింజలు
ధనియాలు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
కాశ్మీరీ ఎండుమిర్చి - 1
రసం మిశ్రమం కోసం:
బాగా పండిన టమాటాలు - 3
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
ఇంగువ - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 1 రెబ్బ
నీళ్లు - ఒకటింబావు లీటర్లు
నూనె - 1 1/4 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - పావు టీస్పూన్
ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 రెబ్బ
వెల్లుల్లి - 3 రెబ్బలు
నెయ్యి - అర టీస్పూన్
బెల్లం - 1 చిన్న ముక్క

టమాటా రసం తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, కాశ్మీరీ ఎండుమిర్చి వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ తాజా పొడే రసానికి అసలైన ప్రాణం పోస్తుంది.
-ఒక వెడల్పాటి గిన్నెలో తరిగిన టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, తాజా కొత్తిమీర, కరివేపాకు వేసి మీ చేతులతో టమాటా ముక్కలు మెత్తబడేలా బాగా పిసుక్కుంటూ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒకటింబావు లీటర్ల నీళ్లు పోసి, అందులో పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి.
-తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక.. ఆవాలు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న తాజా రసం పొడిని ఈ తాలింపులో వేసి మంచి సువాసన వచ్చే వరకు, అంటే సుమారు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు నీటిని ఆ తాలింపులో పోయండి. వెంటనే దానికి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కమ్మటి వాసన కోసం కొద్దిగా నెయ్యి, రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్క జోడించండి. మంటను మీడియంలో పెట్టి, రసం పైకి నురుగులా పొంగుతూ వస్తున్న సమయంలో (రసాన్ని ఎప్పుడూ ఎక్కువగా మరిగించకూడదు) స్టవ్ ఆపేయండి.
-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి టమాటా రసం రెడీ. దీన్ని వేడి అన్నంలో పోసుకుని, అప్పడాలు నంజుకుని తింటుంటే.. ఆ అద్భుతమైన రుచికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications